Foreign Vehicles : హైదరాబాద్‌లో ఫారిన్ లగ్జరీ కార్లు, రూ.5 కోట్లు జరిమానా

హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో రవాణా శాఖ అధికారులు మెరుపుదాడులు చేశారు. తెలంగాణ రవాణా శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో అధికారుల బృందం విదేశీ

Foreign Vehicles : హైదరాబాద్‌లో ఫారిన్ లగ్జరీ కార్లు, రూ.5 కోట్లు జరిమానా

Foreign Vehicles

Updated On : August 15, 2021 / 10:39 PM IST

Foreign Vehicles : హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో రవాణా శాఖ అధికారులు మెరుపుదాడులు చేశారు. తెలంగాణ రవాణా శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో అధికారుల బృందం విదేశీ వాహనాలపై కొరడా ఝళిపించింది. తెలంగాణలో రోడ్ ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్న పది విదేశీ వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఆ కార్ల యజమానులకు ఏకంగా రూ.5 కోట్ల జరిమానా విధించారు.

తెలంగాణ ఉప రవాణ శాఖ అధికారి పాపారావు నేతృత్వంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ రోడ్ ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్న పది విదేశీ వాహనాల యజమానులపై అధికారులు కేసులు బుక్ చేశారు.

విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న కార్లకు భారీగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రాయబారులకు పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. దీనిని అదనుగా తీసుకుని విచ్చలవిడిగా విదేశాల నుండి కార్లు దిగుమతి చేస్తోంది ముంబై మాఫియా. ఈ వ్యవహారం ఇటీవల దేశంలో సంచలనం సృష్టించింది.

విదేశాల నుండి వస్తున్న కార్లు ముంబై నుండి మణిపూర్ లో ఓ మారుమూల షో రూంలో రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. రాయబారులు పేరుతో చెల్లించాల్సిన పన్ను ఎగొట్టేందుకు ముఠా ప్లాన్ చేస్తోంది. ఏడాది కాలంలో 20కి పైగా కార్లు దిగుమతి అయ్యాయి. ముంబై ముఠా నుండి వస్తున్న కార్లు ఎక్కువ శాతం హైదరాబాద్ ప్రముఖులే కొన్నట్టు అభియోగం ఉంది.