YS Sharmila Greets Revanth Reddy: కాంగ్రెస్‭కు ఎల్లవేళలా సహాకారం అందిస్తాం.. షర్మిల

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున కాంగ్రెస్ సర్కారుకు ఎల్లవేళలా సహకారం, మద్దతు ఉంటుంది. మనస్ఫూర్తిగా అందించడానికి మేము సిద్దమే అని సంతోషంగా తెలియజేస్తున్నాము.

YS Sharmila Greets Revanth Reddy: కాంగ్రెస్‭కు ఎల్లవేళలా సహాకారం అందిస్తాం.. షర్మిల

కాంగ్రెస్ పార్టీకి తాము ఎల్లవేళలా సహకారం అందిస్తామని వైయస్ఆర్‭టీపీ అధినేత వైయస్ షర్మిల అన్నారు. ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ విషయమై ఆమె మాట్లాడుతూ.. తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

‘‘పదేండ్ల నియంత పాలనను నిలువునా పాతిపెడుతూ, మీ మీద నమ్మకంతో, సరికొత్త ఆశలతో కాంగ్రెస్ కు పట్టంకడుతూ తెలంగాణ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఒక అద్భుతం. అయితే ఇప్పుడు ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వం మరొక్క మహత్తర ఘట్టం. ఇది సుపరిపాలనకు నాందని మేము ఆశిస్తున్నాం. ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా.. నిబద్ధత, నిస్పాక్షికతకు మారుపేరుగా ఈ సర్కారు ఉండబోతోంది. ఇది నూటికి నూరుశాతం నాలుగు కోట్ల ప్రజల నమ్మకం’’ అని ఆమె అన్నారు.

ఇంకా ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ‘‘వైయస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున కాంగ్రెస్ సర్కారుకు ఎల్లవేళలా సహకారం, మద్దతు ఉంటుంది. మనస్ఫూర్తిగా అందించడానికి మేము సిద్దమే అని సంతోషంగా తెలియజేస్తున్నాము. ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ నాయకులకు మా శుభాకాంక్షలు’’ అని పోస్ట్ చేశారు.