MP Venkatesh Netha : కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత?

MP Venkatesh Netha : పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించి కాంగ్రెస్‌‌లో చేరిన వెంకటేష్ నేత ఇప్పుడు బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.

MP Venkatesh Netha : కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత?

MP Venkatesh netha to be joined BJP

Updated On : April 17, 2024 / 4:35 PM IST

MP Venkatesh Netha : మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి బిగ్ షాక్‌ తగిలింది. పార్టీ ఫిరాయింపుల్లో తెలంగాణ హస్తం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించి కాంగ్రెస్‌‌లో చేరిన వెంకటేష్ నేత ఇప్పుడు బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. గడ్డం వంశీకి కాంగ్రెస్ టికెట్ కేటాయించడంతో పార్టీ కార్యక్రమాలకు ఎంపీ వెంకటేష్ గతకొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు.

Read Also : Komatireddy Comments : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు

టికెట్ కేటాయింపులో కాంగ్రెస్‌ మొండిచేయి చూపిన నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు సిట్టింగ్ ఎంపీ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే, పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఒకవేళ వెంకటేష్ నేత బీజేపీలో చేరితే.. గోమాస శ్రీనివాస్‌ను బుజ్జగించి అభ్యర్థిగా వెంకటేష్ నేతను ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Read Also : Lok Sabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల జాతర.. ఈ నెల 25 వరకు తుదిగడువు