Drug supplier krishna kishore reddy : డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కృష్ణ కిశోర్ రెడ్డి విచారణలో షాకింగ్ విషయాలు
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కృష్ణ కిశోర్ రెడ్డి విచారణలో షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.

Drug supplier krishna kishore reddy
Drug supplier krishna kishore reddy : డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వ్యాపారవేత్త కృష్ణ కిశోర్ రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో అతనికి డ్రగ్స్ ఎలా అలవాటుగా మారాయి? ఎవరితో పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి? డ్రగ్స్ ఎలా తరలించేవారు? ఎక్కడెక్కడినుంచి ఎవరెవరికి ఇచ్చేవారు? కొత్తవారిని ఆకర్షించి కష్టమర్లుగా ఎలా చేసుకునేవారు?వారికి డ్రగ్స్ ఎలా అలవాటు చేసేవారు? అనే పలు విషయాలను కృష్ణ కిశోర్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయాలు వింటే షాకింగ్ గా ఉన్నాయి. డ్రగ్స్ సప్లయర్ మైరాన్ మోహిత్ ను పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. మోహిత్ తోపాటు ప్రముఖ వ్యాపారి మన్యం కృష్ణ కిషోర్ రెడ్డిని అరెస్టు చేశారు. కొకైన్ సప్లై చేస్తుండగా ఓ పబ్ లో మోహిత్ ను నార్కోటిక్ అధికారులు పట్టుకుని విచారిస్తుండగా షాకింగ్ విషయాలు వెల్లడించాడు కృష్ణ కిషోర్.
తనకు స్నేహితుల ద్వారా డ్రగ్స్ అలవాటు అయ్యిందని, గోవా, బెంగళూరు, ముంబై వెళ్లినప్పుడు తాము తరచు డ్రగ్స్ తీసుకునేవాళ్లమని తెలిపాడు. ప్రతీ బిజినెస్ పార్టీలోను డ్రగ్స్ కంపల్సరిగా ఉండాల్సిందేనని..ఆ అలవాటుతోనే తనకు డ్రగ్స్ పెడ్లర్స్ తో పరిచయాలు ఏర్పడ్డాయని వివరించాడు. గోవా, బెంగళూరు నుంచి అత్యంత చాకచక్యంగా లగ్జరీ బస్సులో డ్రగ్స్ తరలించేవాడినని తెలిపాడు.గోవా, బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చేవారితో కాంటాక్ట్స్ ఏర్పడ్డాయని..ఫామ్ హౌస్, పబ్బుల్లో స్నేహితులకు డ్రగ్స్ పార్టీ ఇచ్చేవారమని వివరించాడు. అలాగే బిజినెస్ పార్టీ, రేవ్ పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడినని..లగ్జరీ బస్సుల్లో పచ్చళ్లు,ఎనర్జీ ఫుడ్స మధ్య డ్రగ్స్ పార్సిల్స్ పెట్టి తెప్పించేవాడినని వివరించాడు. డ్రగ్స్ ఫోటోలు, డ్రైవర్ ఫోటోలు, బస్సు నెంబరు,బస్సు ఫోటోలను తనకు వాట్సాప్ లో పంపించేవారని తెలిపాడు.
Drug supplier Mohit : పబ్‌లో వెయిటర్ నుంచి .. డ్రగ్ సప్లయిర్‌గా మారిన హీరోయిన్ భర్త మోహిత్
కాగా తీగలాగితే డొంక కదిలినట్లుగా ఇంటర్నేషనల్ డ్రగ స్మగ్లర్ ఎడ్విన్ అరెస్ట్ తో హీరోయిన్ నేహా దేశ్ పాండే భర్త మైరాన్ మోహిత్ తో పాటు హైదరాబాద్ కు చెందిన వ్యాపారి కృష్ణకిషోర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా ఇద్దరు షాకింగ్ విషయాలు వెల్లడించారు. మోహిత్ ను విచారించగా ముంబైలో బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖార్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తో పట్టుబడ్డ క్రూజ్ షిప్ లో మోహిత్ కూడా ఉన్నాడని ఆ షిప్ లో డీజే ఏర్పాటు చేసింది మోహిత్తే నని అధికారులు గుర్తించారు.