Ration Cards: రేషన్ కార్డుకు అప్లయ్ చేసిన వారికి షాకింగ్ న్యూస్ ..

మీరు కొత్త రేషన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే, మీకు షాకింగ్ న్యూస్.. అదేమిటంటే..

Ration Cards: రేషన్ కార్డుకు అప్లయ్ చేసిన వారికి షాకింగ్ న్యూస్ ..

CM Revanth Reddy

Updated On : February 28, 2025 / 8:39 AM IST

Ration Cards: అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తొలిగిపోయిన వెంటనే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది.

Also Read: Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై డౌట్స్ ఉన్నాయా..? మీకో అప్డేట్..

హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల మాట్లాడుతూ.. మార్చి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ విషయంపై పౌరసరఫరాల శాఖ అధికారులకు ఎలాంటి ఆదేశాలు అందకపోవటం గమనార్హం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. మూడు నెలల క్రితం నిర్వహించిన కుటుంబ, సామాజిక, ఆర్థిక సర్వేలో గుర్తించిన అర్హత గల కుటుంబాల జాబితా కూడా జీహెచ్ఎంసీ నుంచి పౌరసరఫరాల శాఖకు అందకపోవటం, మరోవైపు ఆన్ లైన్ దరఖాస్తులపై కనీస విచారణ ప్రారంభం కాకపోవటం అనేక అనుమానాలకు తావునిస్తోంది. దీంతో మార్చి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ పై సందిగ్దత నెలకొంది.

Also Read: Telangana: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. నాన్ లోకల్ కోటా ఎత్తివేత.. స్టూడెంట్స్ కు జరిగే లాభం ఇదే..

కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్ లైన్ లో గురువారం నాటికి సుమారు 1,31, 484 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఎలాంటి క్షేత్రస్థాయి విచారణ ప్రారంభం కాలేదు. ప్రభుత్వం నుంచి కూడా తగిన ఆదేశాలు జారీ కాలేదు. అయితే, తాజాగా మార్చి 1వ తేదీ నుంచి కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రకటించడంతో పరిస్థితి అయోమయంగా తయారైంది. అయితే, కొత్త రేషన్ కార్డుల జారీ విషయంపై పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్న వివరాల ప్రకారం.. ఆన్ లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ అనంతరం కార్డుల మంజూరు చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో మార్చి 1వ తేదీన కొత్త రేషన్ కార్డుల పంపిణీ లేనట్లేనని పలువురు పేర్కొంటున్నారు.