GST Officials Kidnap : దుకాణం సీజ్ చేశారని.. ఏకంగా జీఎస్టీ అధికారులనే కిడ్నాప్ చేసిన యజమానులు

దుకాణంలో ఉన్న ఖమ్యుం, ఫీరోజ్ తదితరులు అధికారుల ఐడీ కార్డులు చింపి, వారిపై దాడి చేశారు. అధికారులను నిర్బంధించి ఫార్చునర్ కారులో కిడ్నాప్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్ వైపు తరలించారు.

GST Officials Kidnap : దుకాణం సీజ్ చేశారని.. ఏకంగా జీఎస్టీ అధికారులనే కిడ్నాప్ చేసిన యజమానులు

GST Officials Kidnap

Updated On : July 6, 2023 / 11:38 AM IST

Shop Owners Kidnap GST Officials : హైదరాబాద్ లో దుకాణం సీజ్ చేశారని షాపు యజమానులు ఏకంగా జీఎస్టీ అధికారులనే కిడ్నాప్ చేశారు. బుధవారం సీజ్ చేసిన ఐరన్ స్క్రాప్ దుకాణం పంచనామాకు వచ్చిన జీఎస్టీ అధికారులను సదరు షాపు యజమానులు కిడ్నాప్ చేశారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి కిడ్నాప్ కు గురైన అధికారులను విడిపించి నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు సూరూర్ నగర్ సీఐ జానకీ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.

సరూర్ నగర్ లోని సాయికృష్ణానగర్ కాలనీలో గ్రేడ్-1 ఇనుప స్క్రాప్ దుకాణం ఉంది. జీఎస్టీ చెల్లించడం లేదని, ఫేక్ జీఎస్టీ వాడుతున్నారని ఆ షాపును మంగళవారం అధికారులు సీజ్ చేశారు. దుకాణం పంచనామా కోసం జీఎస్టీ కార్యాలయం నుంచి జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఇన్ స్పెక్టర్ మనీస్ శర్మ, సీనియర్ ఇంటలిజెన్స్ అధికారి వీడీ ఆనంద్ రావు బుధవారం ఉదయం 1:30 గంటలకు ఆ షాపు వద్దకు వచ్చారు.

Whale Vomit : రూ.3 కోట్ల విలువైన తిమింగలం వాంతి లభ్యం

ఈ సమయంలో దుకాణంలో ఉన్న ఖమ్యుం, ఫీరోజ్ తదితరులు అధికారుల ఐడీ కార్డులు చింపి, వారిపై దాడి చేశారు. అధికారులను నిర్బంధించి ఫార్చునర్ కారులో కిడ్నాప్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్ వైపు తరలించారు. వెంటనే అధికారుల వాహన డ్రైవర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కిడ్నాప్ ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించారు. అధికారుల ఫోన్ నెంబర్ జీపీఎస్ ఆధారంగా వారు కొత్తపేట మీదుగా నగరం వైపు వస్తున్నారని గమనించి దిల్ సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద కారును గుర్తించారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న జీఎస్టీ అధికారులను విడిపించారు.

Mahabubabad: అర్థరాత్రి టమాటాలు చోరీ.. బాక్సులు మాయం.. రంగంలోకి పోలీసులు

కిడ్నాప్ కు పాల్పడిన గ్రేడ్-1 స్క్రాప్ దుకాణం యజమాని సయ్యద్ ఫిరోజ్ (36), సయ్యద్ ముజీబ్ (37), షేక్ ముషీర్(29), సయ్యద్ ఇంతియాజ్ (33)ను అరెస్టు చేశారు. వీరంతా గుంటూరు టీడీపీ నాయకుడు ముజీబ్ సోదరులు కావడం గమనార్హం. ఈ కేసులో మరో ప్రధాన సూత్రధారి ఖమ్యుం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.