రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ పెద్దన్న అయితే రాహుల్ గాంధీ ఏమి కావాలి?
రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ పెద్దన్న అయితే రాహుల్ గాంధీ ఏమి కావాలి? రాహుల్ ఆదిశంకరాచార్యుల్లా దేశం అంతా తిరుగుతున్నారు.

singireddy niranjan reddy slams cm revanth reddy
Singireddy Niranjan Reddy: రాజ్యాంగ బద్దంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేర పూరిత కుట్రలు ప్రేరేపించేలా, ప్రజలు అసహ్యించుకునేల ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. పాలమూరు సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు, హైకోర్టు సుమోటోగా విచారణ జరపాలని కోరారు. తమ ప్రభుత్వం ఎంతో సహనంగా పనిచేసిందని గుర్తు చేశారు.
మీ ప్రభుత్వాన్ని పడగొడతామని ఎవరు చెప్పారు? నీ పక్కన ఉండే వాళ్లపై మీకు అనుమానాలు ఉన్నాయి. ఆయన మాటలను బట్టే రేవంత్ మానసిక స్థితి ఏంటో తెలుస్తుంది. టీడీపీలో ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీపై ఎన్ని విమర్శలు చేశారో అందరికీ తెలుసు . సీఎం రేవంత్ అసహనంతో మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారు. కేసీఆర్‌కు మీ సర్టిఫికెట్ అవసరం లేదు. కాంగ్రెస్ లో రేవంత్ ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. రేవంత్ చంద్రబాబు పెంపుడు బిడ్డ. పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటే సరిపోదు. కేసీఆర్‌పై విమర్శలు చేస్తే తప్ప ముఖ్యమంత్రికి పూట గడవడం లేదు.
Also Read: టచ్ చేస్తే అంతు చూస్తా, మరో పదేళ్లు మనదే అధికారం- సీఎం రేవంత్ మాస్ వార్నింగ్
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీల గురించి మేము అడిగినా కేంద్రం పట్టించుకోలేదు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు అడగలేదు. రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ పెద్దన్న అయితే రాహుల్ గాంధీ ఏమి కావాలి? రాహుల్ ఆదిశంకరాచార్యుల్లా దేశం అంతా తిరుగుతున్నారు. రాహుల్ ప్రధాని అవుతారని నమ్మకం లేక మోదీకి రేవంత్ దగ్గరవుతున్నారు. రాహుల్ ప్రేమ పంచుదాం అంటే.. రేవంత్ హింసను ప్రేరేపిస్తున్నారు. సీఎం పాలమూరు ప్రజలకు ముందు క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బీజేపీతో ఎన్నికల్లో సహకరించుకునేందుకు సిద్ధం అవుతున్నారని నిరంజన్ రెడ్డి అన్నారు.
Also Read: మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత