CM Revanth Reddy : టచ్ చేస్తే అంతు చూస్తా, మరో పదేళ్లు మనదే అధికారం- సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

గత పాలకులు పాలమూరుకు ఏమైనా తీసుకొచ్చారా? పందికొక్కుల్లా పదేళ్లు దోచుకుతిన్నారు.

CM Revanth Reddy : టచ్ చేస్తే అంతు చూస్తా, మరో పదేళ్లు మనదే అధికారం- సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

CM Revanth Mass Warning

Updated On : March 6, 2024 / 9:33 PM IST

CM Revanth Reddy : పాలమూరు బిడ్డను సీఎంను చేసిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రజలకు ఇచ్చిన గౌరవం ఇది అని ఆయన అన్నారు. డిసెంబర్ 3న తెలంగాణకు పట్టిన పీడ వదిలిందన్నారు సీఎం రేవంత్. కార్యకర్తల వల్లే మనం అధికారంలో ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంతో కొట్లాడతానని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ చెవిలో తాను గుసగుస చెప్పలేదన్నారు.

”అతిథి మన ఇంటికి వస్తే గౌరవించాలని వెళ్లాను. మోదీ తెలంగాణకు సహకరించకపోతే ఎదిరిస్తా. బిల్లాతో అయినా కేడీతో అయినా కొట్లాడతా. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి. గత పాలకులు పాలమూరుకు ఏమైనా తీసుకొచ్చారా? పందికొక్కుల్లా పదేళ్లు దోచుకుతిన్నారు. పాలమూరు జిల్లాకు బీఆర్ఎస్ ఏం చేసింది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మీ అంతు చూస్తా. ఎవరికి అన్యాయం చేశామని ప్రభుత్వాన్ని పడగొతామంటున్నారు? ఇందిరమ్మ రాజ్యాన్ని చూసి కళ్లు మండుతున్నాయా?” అని నిప్పులు చెరిగారు సీఎం రేవంత్.

పాలమూరు నుంచి లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరించారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. నేనేమీ తలుపులు మూసి కాళ్లు పట్టుకోలేదు అంటూ బీఆర్ఎస్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read : బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుతో గరం గరం.. గులాబీ పార్టీకి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గుడ్ బై?