బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుతో గరం గరం.. గులాబీ పార్టీకి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గుడ్ బై?

ఆ ఎన్నికల్లో బీజేపీ నేత పాల్వాయి హరీశ్ బాబు గెలిచారు. ఎన్నికల్లో హరీశ్ బాబుకి 63,702 ఓట్లు రాగా, కోనేరు కోనప్పకు..

బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుతో గరం గరం.. గులాబీ పార్టీకి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గుడ్ బై?

Koneru Konappa

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుతో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అసంతృప్తితో ఉన్నారు. ఆయన బీఆర్ఎస్‌కు రాజీనామా చేయనున్నారు. గత ఎన్నికల్లో కొమురం భీం జిల్లాలోని సిర్పూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో బీఆర్ఎస్ తరఫున కోనేరు కొనప్ప పోటీ చేశారు.

ఆ ఎన్నికల్లో బీజేపీ నేత పాల్వాయి హరీశ్ బాబు గెలిచారు. ఎన్నికల్లో హరీశ్ బాబుకి 63,702 ఓట్లు రాగా, కోనేరు కోనప్పకు 60,614 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు 44,646 ఓట్లు పడ్డాయి. తనపై పోటీ చేసిన నేతతోనే బీఆర్ఎస్ పొత్తుపెట్టుకోవడంతో కోనప్ప నిరాశకు గురయ్యారు.

పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ సభత్వనికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరునున్నట్టు సమాచారం. కొనప్పతో పాటు రాజీనామా చేసేందుకు ఓ జడ్పీ చైర్మన్, ఆరుగురు ఎంపీపీలు, ఐదుగురు జడ్పీటీసీలు, ఒక మున్సిపల్ చైర్‌పర్సన్ , 24 మంది కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, వందకు పైగా మాజీ సర్పంచ్ లు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు రాజీనామా లేఖను కేసీఆర్ పంపనున్నారు.

పార్లమెంట్ ఎన్నికల తరువాత హరీష్ రావు బీజేపీలోకి పోతడు : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి