పార్లమెంట్ ఎన్నికల తరువాత హరీష్ రావు బీజేపీలోకి పోతడు : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే శక్తి లేకనే అసెంబ్లీ రావడం లేదు. ప్రతిపక్ష నాయకుడి హోదా కొడుకుకు ఇస్తే అల్లుడు పోతాడు.. అల్లుడుకిస్తే కొడుకు పోతాడు..

పార్లమెంట్ ఎన్నికల తరువాత హరీష్ రావు బీజేపీలోకి పోతడు : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Minister Komati Reddy

Minister Komatireddy : పార్లమెంట్ ఎన్నికల తరువాత హరీష్ రావు బీఆర్ఎస్ లో కొనసాగడం డౌటే.. బీజేపీలోకి పోతడు. బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నాడని తెలుస్తోంది అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే శక్తి లేకనే అసెంబ్లీ రావడం లేదని విమర్శించారు.

Also Read : వైసీపీలో ముద్రగడ చేరికకు ముహూర్తం ఫిక్స్? ఫోన్‌లో మాట్లాడిన వైసీపీ ఎంపీ

ప్రతిపక్ష నాయకుడి హోదా కొడుకుకు ఇస్తే అల్లుడు పోతడు.. అల్లుడుకిస్తే కొడుకు పోతడు. బీఆర్ఎస్ పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత హరీష్ రావు కూడా ఉండటం డౌటే. బీజేపీలోకి పోతడు. బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నాడని తెలుస్తోంది అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లా.. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఆ పార్టీలో మిగిలేది నలుగురే అవుతారు. కేసీఆర్ కు దిక్కులేక ఆర్ఎస్ ప్రవీణ్ కాళ్లు పట్టుకునే పరిస్థితి వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తే కలిసి వినతిపత్రం ఇవ్వాలి. అందులో తప్పేముంది.. మోదీ జేబులో నుంచి ఇవ్వడం లేదు.. అది ప్రజల సొమ్మే అంటూ  మంత్రి వ్యాఖ్యానించారు. ఎల్ఆర్ఎస్ గైడ్ లైన్స్ పూర్తికాలేదని చెప్పారు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీచేస్తే మోదీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని కోమటిరెడ్డి అన్నారు.