వైసీపీలో ముద్రగడ చేరికకు ముహూర్తం ఫిక్స్? ఫోన్‌లో మాట్లాడిన వైసీపీ ఎంపీ

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. మాజీ మంత్రి, ఏపీ కాపు నేత ముద్రగడ పద్మనాభం..

వైసీపీలో ముద్రగడ చేరికకు ముహూర్తం ఫిక్స్? ఫోన్‌లో మాట్లాడిన వైసీపీ ఎంపీ

Mudragada Padmanabham

Mudragada Padmanabham Join In YSRCP : ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. మాజీ మంత్రి, ఏపీ కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 12న ఆయన వైసీపీలో చేరుతారని సమాచారం. ముద్రగడ ఇంటికి వైసీపీ నేత జక్కంపూడి గనేశ్ వెళ్లారు. వైసీపీలో చేరాలని ఆహ్వానించారు. వైసీపీ ఎంపీ, ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోర్డినేటర్ మిథున్ రెడ్డి సైతం ముద్రగడతో ఫోన్ లో మాట్లాడారు.. వైసీపీలోకి ఆహ్వానించారు. అయితే, మీరు అడుగుతున్నారా జగన్ అడగమన్నారా అని మిథున్ రెడ్డిని ముద్రగడ ప్రశ్నించగా.. సీఎం జగన్ అడగమన్నారని మిథున్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. దీంతో ముద్రగడ ఈనెల 12న వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

Also Read : చంద్రబాబుతో ముగిసిన పవన్ కల్యాణ్ భేటీ.. గంటన్నరపాటు ఇరువురు నేతల మధ్య సాగిన చర్చలు

ఏపీ రాజకీయాల్లో కొద్దిరోజులుగా ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరుతారనే అంశం ఉత్కంఠభరితంగా మారింది. ఆయన తొలుత జనసేన పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. వైస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన జనసేన నేతలు ముద్రగడతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ ముద్రగడ నివాసంకు వచ్చి పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లుగా కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే, టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుంది. దీనిపై ముద్రగడ పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. ఈ లేఖ తరువాత పవన్ టీడీపీ – జనసేన నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. పార్టీ మద్దతు దారులు నాకు సలహాలు ఇవ్వద్దు.. నాపై నమ్మకం ఉంటే నాతో కలిసిరండి అంటూ వ్యాఖ్యానించారు. దీంతో  ముద్రగడ జనసేనకు దూరమైనట్లు.. వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఆయన వైసీపీ తరపున పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని, ఒకవేళ ఆయన పోటీ చేయకపోయినా ఆయన కుమారుడు పోటీ చేస్తారని వైసీపీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి.

Also Read : బీసీలను మోసం చేయడం చంద్రబాబు అలవాటు: మంత్రి వేణు

ఈ పరిణామాల నేథప్యంలో మంగళవారం వైసీపీ నేత జక్కంపూడి గణేశ్ ముద్రగడను కలిసి.. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముద్రగడతో ఫోన్ లో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో ముద్రగడ ఈనెల 12న వైసీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీచేసినా, చేయకపోయినా పార్టీలో చేరుతానని ముద్రగడ వైసీపీ నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం.