Phone Tapping Case: మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్‌ రావుకు చెప్పిన అధికారులు

ప్రభాకర్ రావును సిట్ అధికారులు 8 గంటలపాటు ప్రశ్నించారు.

Phone Tapping Case: మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్‌ రావుకు చెప్పిన అధికారులు

Updated On : June 9, 2025 / 9:43 PM IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో నేటి సిట్ విచారణ ముగిసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మాజీ ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు 8 గంటలపాటు ప్రశ్నించారు.

డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో విచారణ జరిగింది. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. మరోసారి ఆయనను సిట్ విచారించనుంది. ఈనెల 11న మరోసారి విచారణకు రావాల్సిందిగా ప్రభాకర్‌కు చెప్పింది.

Also Read: విస్తరణ సరే.. శాఖల కేటాయింపు ఎప్పుడు? సీఎం మదిలో ఏముంది?

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐదుగురు నిందితులను సిట్ ఇప్పటికే విచారించింది. నిందితుల స్టేట్మెంట్, సేకరించిన ఆధారాలతో ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్, ఫోరెన్సిక్ నుంచి సిట్ డేటాను తెప్పించుకుంది. న్యాయస్థానంలో వినిపించిన వాదనలనే మరోసారి సిట్ ముందు ప్రభాకర్‌రావు చెప్పారు.