SLBC Tunnel Mishap : ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ఐదు అనుమానిత లోకేషన్లు గుర్తించిన NGRI బృందం

ఇందులో భాగంగా గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ పరికరంతో స్కానింగ్ చేస్తున్నారు.

SLBC Tunnel Mishap : ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ఐదు అనుమానిత లోకేషన్లు గుర్తించిన NGRI బృందం

SLBC Tunnel Indicent

Updated On : February 28, 2025 / 10:44 PM IST

SLBC Tunnel Mishap : ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అందులో కీలక పురోగతి కనిపించింది. టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం అత్యాధునిక పరికరాలతో గాలిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ పరికరంతో స్కానింగ్ చేస్తున్నారు. రాత్రి జీపీఎర్ మిషన్ తో స్కాన్ చేసిన ఎన్జీఆర్ ఐ బృందం.. మొత్తం ఐదు అనుమానిత లొకేషన్లు గుర్తించింది. అనుమానిత లొకేషన్లలో డ్రిల్లింగ్ పనులు చేపట్టింది రెస్క్యూ ఆపరేషన్ టీమ్. మార్కింగ్ తర్వాత బురద తవ్వుతూ తప్పిపోయిన వారి ఆచూకీ కోసం గాలించనున్నాయి.

ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో ఏడు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఆక్వా ఐ అనే లేటెస్ట్ టెక్నాలజీ పరికరంతో టన్నెల్ లో చిక్కుకుపోయిన వారిని ఎక్కడ ఉన్నారో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎక్విప్ మెంట్ వాటర్ ఉన్న ప్రాంతంలో రెండు మీటర్ల దూరంలో చిక్కుకుపోయిన వారిని కూడా గుర్తిస్తుందని అంటున్నారు.

Also Read : దమ్ముంటే ఏపీలో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయండి- కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్

మట్టి, బురద ఉంటే ఐడెంటిఫికేషన్ కాస్త కష్టమవుతుందని రెస్క్యూ టీమ్స్ చెబుతున్నాయి. నిన్న, మొన్నటితో పోలిస్తే సహాయక చర్యలు మరింత ముమ్మరం అయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి, ర్యాట్ హోట్ మైనర్స్, సింగరేణి, రైల్వే ఇతర రెస్క్యూ టీమ్స్ టన్నెల్ ఆపరేషన్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్లాస్మా కట్టర్లతో టన్నెల్ బోరింగ్ మిషన్ పరికరాలను కట్ చేస్తున్నారు.

సొరంగంలో పేరుకుపోయిన బురదను డబ్బాల్లో బయటకు తరలిస్తున్నారు. భారీ మోటర్ల సాయంతో సీపేజ్ వాటర్ ను కూడా తోడేస్తున్నారు. అంతేకాదు లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఎక్విప్ మెంట్ తో టన్నెల్ లో చిక్కుకున్న 8మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ.. టన్నెల్ లో సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారాయి. దేశంలో అత్యంత పొడవైన టన్నెల్ అయిన ఎస్ ఎల్ బీసీలో మధ్యలో ఎక్కడా కూడా బయటకు వెళ్లే రూట్ లేదు. ఒక్కసారి లోపలికి వెళ్లడానికి టన్నెల్ లో 13 కిలోమీటర్లు, బయటకు రావడానికి మరో 13 కిలోమీటర్లు ఒకే రూట్ లో ప్రయాణించాల్సిన పరిస్థితి. దీంతో ప్రతికూల పరిస్థితుల మధ్య రెస్క్యూ టీమ్స్ కు సహాయక చర్యలు చాలా ఇబ్బందికరంగా మారాయి.