తెలియదు.. గుర్తులేదు.. అవగాహన లేదు..! కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు స్మితా సబర్వాల్
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు ఐఏఎస్ స్మితా సభర్వాల్ హాజరయ్యారు. క్యాబినెట్ ఆమోదం పొందకుండానే మూడు బ్యారేజీల నిర్మాణ పనులు ...

Smita Sabharwal
Smita Sabharwal : కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. తాజాగా గురువారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు ఐఏఎస్ స్మితా సభర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ తో అన్నీ నిజాలే చెబుతానని తొలుత ప్రమాణం చేయించినట్లు తెలిసింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ ల నిర్మాణ అమనుతులపై కమిషన్ స్మిత సభర్వాల్ ను ప్రశ్నలు అడిగింది. క్యాబినెట్ ఆమోదం లేకుండానే మూడు బ్యారేజీలకు చెందిన పరిపాలన అనుమతుల జీవోలు తెలియజేశారా? అంటూ కమిషన్ ప్రశ్నించగా.. నా దృష్టిలో లేదని స్మితా సభర్వాల్ సమాధానం ఇచ్చారు. కొన్ని ఫైల్స్ సీఎంవోకి రాకుండానే, క్యాబినెట్ అనుమతి పొందకుండానే పరిపాలన అనుమతులు పొందాయా అని కమిషన్ ప్రశ్నించగా.. నాకు తెలీదు, అవగాహన లేదు అని స్మితా సభర్వాల్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
Also Read: KTR: ఆ విషయంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి.. రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
క్యాబినెట్ ఆమోదం పొందకుండానే మూడు బ్యారేజీల నిర్మాణ పనులు ప్రారంభించారా? అని కమిషన్ ప్రశ్నించగా.. నాకు తెలీదని స్మిత సభర్వాల్ సమాధానం ఇచ్చారు. దాచడానికి ఏమీ లేదు.. నిజాలు మాత్రమే చెప్పాలని ఆమెకు కమిషన్ సూచించగా.. సీఎంవోకి వచ్చేటువంటి ప్రతీ ఫైల్ సీఎం అప్రూవల్ ఉంటుందని, 2014 నుంచి పదేళ్లపాటు గత ప్రభుత్వం సీఎంవోలో సెక్రటరీగా పని చేశానని, సీఎంవోలో ఏడు శాఖలను చూశానని కాళేశ్వరం విచారణ కమిషన్ కి ఆమె చెప్పినట్లు తెలిసింది. మై రోల్ ఈజ్ లిమిటెడ్ జనరల్ కో-ఆర్డినేషన్ మాత్రమే అని కమిషన్ ముందు ఆమె చెప్పారు.
మూడు గ్యారేజీలకు సంబంధించిన ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి నోట్స్ సీఎంవోకి వచ్చాయా అని కమిషన్ ప్రశ్నించగా.. నా దృష్టిలో లేదు. నాకు ప్రస్తుతం గుర్తుకులేదు అని కమిషన్ కు స్మిత సభర్వాల్ తెలిపినట్లు తెలిసింది. అయితే, కమిషన్ సంధించిన అధిక శాతం ప్రశ్నలకు నాకు తెలియదు.. అవగాహన లేదు అంటూ ఆమె సమాధానం ఇచ్చినట్లు సమాచారం.