KTR: ఆ విషయంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి.. రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

కేటీఆర్ తన లేఖలో.. అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టారు. ఒకవైపు మీరు అదానీని అవినీతికి చిహ్నంగా పేర్కొంటున్నారు.

KTR: ఆ విషయంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి.. రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

KTR letter to Rahul Gandhi

Updated On : December 19, 2024 / 2:17 PM IST

KTR letter to Rahul Gandhi : ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ లంచం ఆరోపణలపై విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. అదానీ ఇష్యూపై జేపీసీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని, మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ, కేంద్రం వైఖరికి నిరసనగా ఏఐసీసీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో బుధవారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ ముట్టడి చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్ వేరువేరు కాదని విమర్శించారు. అదానీ విషయంలో కేంద్రాన్ని నిలదీయాలా వద్దా.. కేసీఆర్, బీఆర్ఎస్ వైఖరి ఎమిటో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అయితే, తాజాగా.. కేటీఆర్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు.

Also Read: Parliament: పార్లమెంట్ ఎంట్రన్స్‌లో తోపులాట.. బీజేపీ ఎంపీలకు గాయాలు.. రాహుల్ పై కేసుపెట్టే యోచనలో..

కేటీఆర్ తన లేఖలో.. అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టారు. ఒకవైపు మీరు అదానీని అవినీతికి చిహ్నంగా పేర్కొంటున్నారు. అతను మోదీ ‘క్రోనీ క్యాపిటలిస్ట్’ అని అంటున్నారు. మరోవైపు అదే అదానీని తెలంగాణలోని మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రులు కౌగిలించుకుంటున్నారు. అసలు అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమిటో తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా.. లేక ప్రజలను మోసం చేస్తున్నారా అనే విషయంపై స్పష్టం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో అదానీతో పోరాటం అంటూ తెలంగాణ ప్రభుత్వం దోస్తీ చేస్తోందని కేటీఆర్ ప్రస్తావించారు.