Parliament: పార్లమెంట్ ఎంట్రన్స్‌లో తోపులాట.. బీజేపీ ఎంపీలకు గాయాలు.. రాహుల్ పై కేసుపెట్టే యోచనలో..

పార్లమెంట్ వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకోవటంతో

Parliament: పార్లమెంట్ ఎంట్రన్స్‌లో తోపులాట.. బీజేపీ ఎంపీలకు గాయాలు.. రాహుల్ పై కేసుపెట్టే యోచనలో..

INDIA bloc protest

Updated On : December 19, 2024 / 1:52 PM IST

Congress Vs BJP MPs Protests : పార్లమెంట్ వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకోవటంతో బీజేపీ ఎంపీకి గాయాలయ్యాయి. వెంటనే అతన్ని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. కాగా.. రాహుల్ గాంధీ నెట్టడం వల్లనే బీజేపీ ఎంపీకి గాయాలయ్యాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Jamili Elections Bill : జేపీసీకి జమిలి బిల్లును పంపేందుకు సిద్ధమైన కేంద్రం

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. మరోవైపు అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం ఎంపీలు కూడా నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పార్లమెంట్ లోకి వస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల ఎంపీల మధ్య వాగ్వివాదం, స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దీంతో బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి కిందపడటంతో అతని తలకు గాయమైంది. హుటాహుటీన ఆయన్ను ఆస్పత్రికి తలరించారు. ఈ సందర్భంగా గాయపడిన ఎంపీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేయడంతో.. అతను వచ్చి నామీద పడటం వల్ల నేను కిందపడినట్లు పేర్కొన్నాడు. స్వల్ప తోపులాటలో మరో బీజేపీ ఎంపీ ముఖేష్ రాజ్‌పుత్‌లకు గాయాలయినట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వారిద్దరికి ఫోన్ చేసి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

Also Read: Gossip Garage : పొలిటికల్ జైత్రయాత్రకు కవిత రెడీ..! పోటీ చేసేది అక్కడి నుంచేనా?

తాజా ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. రాహుల్ మాత్రం బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంట్ లోపలికి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బెదిరించి పక్కకు తోసేశారు. తనతోపాటు మల్లికార్జున ఖర్గేను సైతం నెట్టేశారు. రాజ్యాంగంపై బీజేపీ ఎంపీలు దాడి చేస్తున్నారు. అంబేడ్కర్ ను అవమానించారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు లోపలికి వెళ్లే హక్కు ఉందని అన్నారు.

మరోవైపు పార్లమెంట్ కాంప్లెక్స్ లో జరిగిన తోపులాటతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తమ ఇద్దరు ఎంపీలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగా నెట్టేశాడని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే, బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ తప్పుబట్టింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. కుస్తీ పట్టడానికి పార్లమెంట్ వేదిక కాదు.. మీరు ఇతర ఎంపీలపై దాడి చేయడానికి కరాటే- కంగ్ ఫూ నేర్చుకున్నారా అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు.

మరోవైపు కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, కే. సురేశ్, మాణికం ఠాగూర్ లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. మేము మకర ద్వారం నుంచి పార్లమెంట్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. నిరసన తెలుపుతున్న ఎంపీలను లోపలికి రానీయకుండా భౌతికంగా అడ్డుకున్నారు. రాహుల్ గాంధీని అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు భౌతికంగా దూషించారని పేర్కొన్నారు.