Nizamabad : బైక్ స్టార్టవ్వట్లేదని మెకానిక్‌కి చూపించాడు.. బయటకు వచ్చిన నాగుపాముని చూసి షాకయ్యాడు

నిజామాబాద్ జిల్లాలో నాగు పాము కలకలం సృష్టించింది. బైక్‌లో దూరి బయటకు రాకుండా మొరాయించింది. ఎట్టకేలకు దానిని బయటకు తీసిన స్ధానికులు కొట్టి చంపారు.

Nizamabad : బైక్ స్టార్టవ్వట్లేదని మెకానిక్‌కి చూపించాడు.. బయటకు వచ్చిన నాగుపాముని చూసి షాకయ్యాడు

Nizamabad

Updated On : July 16, 2023 / 2:49 PM IST

Nizamabad : వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగానే ఉంటుంది. ఈసారి మరింత ఎక్కువగా ఉండొచ్చని అధికారులు ముందుగానే హెచ్చరించారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో బైక్‌లో నాగుపాము కలకలం సృష్టించింది.

Amruta Fadnavis : పాముల కంటే మనుషులే విషపూరితమైనవారు’: పాములతో డిప్యూటీ సీఎం భార్య ఫోటోలు వైరల్

నిజామాబాద్ జిల్లా అర్గుల్ గ్రామానికి చెందిన ఎల్లాల లింగన్న బైక్ స్టార్ట్ అవ్వకుండా మొరాయించింది. సమస్య ఏంటో అని జక్రాన్ పల్లిలో ఉన్న మెకానిక్ దగ్గరకి తీసుకెళ్లాడు. మెకానిక్ చెక్ చేస్తుంటే బైక్ లోంచి నాగుపాము బయటకు వచ్చింది. దాన్ని చూసి అక్కడ ఉన్నవారంతా షాకయ్యారు. ఇక బయటకు తీయడానికి ప్రయత్నించిన వ్యక్తిని నాగుపాము ముప్పు తిప్పలు పెట్టింది. ఎట్టకేలకు దానిని బలవంతంగా బయటకు తీసారు. స్ధానికులు దానిని చంపేశారు.

Cobra Guards Tomatoes : టమాటాలకు కాపలాగా నాగుపాము

వర్షాకాలంలో పాములు బయటకు వస్తుంటాయి. బైకులు, కార్లు వంటి వాహనాల క్రింద ఆశ్రయం పొందుతుంటాయి. కాబట్టి ప్రజలు వాటిని బయటకు తీసేముందు ఓసారి పరిశీలించుకోవడం మంచిది అని అధికారులు హెచ్చరిస్తున్నారు.