Falaknuma Express: ఫలక్నామా రైలు ప్రమాదంపై అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికుల్ని తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
తెలంగాణలోని భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ఫలక్నామా ఎక్స్ ప్రెస్ రైలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైలు భోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. S4, S5, S6, S7 అనే నాలుగు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి

South Central Railway:తెలంగాణలోని భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలో బెంగాల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నామా ఎక్స్ ప్రెస్ రైలు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనపై దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. రైల్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేరవేసేందుకు రైల్వే కసరత్తులు ప్రారంభించింది. ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇక ప్రమాదం జరిగిన స్థలానికి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ మరికొద్ది సేపట్లో చేరుకోనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి.
Modi Surname Case: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ
రైలు ప్రమాదం కారణంగా ఆ మార్గం గుండా నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, అగ్ని ప్రమాదంపై సహాయక చర్యలపతీ రైల్వే శాఖ ముమ్మరం చేసింది. మంటల్లో చిక్కుకున్న భోగిలనుంచి మిగతా భోగి నుంచి రైల్వే రెస్క్యూ టీం విడదీసింది. నాలుగు బోగీలను అక్కడే వదిలేసి రైలును సికింద్రాబాద్ పంపేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఫలక్నామా ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ బయల్దేరనున్నట్లు తెలుస్తోంది.
Chhattisgarh: ప్రధాని సభకు వెళ్తుండగా ప్రమాదానికి గురైన బస్సు.. స్పాట్లోనే ముగ్గురు మృతి
తెలంగాణలోని భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ఫలక్నామా ఎక్స్ ప్రెస్ రైలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైలు భోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. S4, S5, S6, S7 అనే నాలుగు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. మొదట పొగ రాగానే లోకో పైలట్ గమనించి రైలుని నిలిపివేశారు. రైల్వే సిబ్భంది వెంటనే ప్రయాణికుల్ని దింపేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే కొద్ది మంది ప్రయాణికులకు మాత్రం స్వల్పకాలిక గాయాలైనట్లు తెలుస్తోంది.