Rail Coach Restaurant : రైల్ కోచ్ రెస్టారెంట్ ఓపెన్ అయ్యింది.. ఎక్కడో తెలుసా?

ఫుడ్ లవర్స్‌కి గుడ్ న్యూస్. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయ్యింది. కొత్త అనుభూతిని.. సరికొత్త రుచుల్ని అందిస్తున్న ఆ రెస్టారెంట్ పేరేంటో? అడ్రస్ ఎక్కడో? చదవండి.

Rail Coach Restaurant : రైల్ కోచ్ రెస్టారెంట్ ఓపెన్ అయ్యింది.. ఎక్కడో తెలుసా?

Rail Coach Restaurant

Rail Coach Restaurant : ఫుడ్ లవర్స్ ఎప్పుడూ కొత్త కొత్త రుచులపై ఆసక్తి చూపిస్తారు. రకరకాల హోటల్స్‌కి వెళ్తుంటారు. వీరిని అట్రాక్ట్ చేయడానికి అనేక నగరాల్లో హోటళ్లు వెలుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ‘రైల్ కోచ్ రెస్టారెంట్’ ను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది.

Restaurant on Wheels: కాచిగూడలో రెస్టారెంట్ ఆన్ వీల్స్.. వాకీ టాకీలో ఆర్డర్.. నోరూరించే రుచులు

ఉరుకుల పరుగుల జీవితాల్లో చాలామందికి  హోటల్ ఫుడ్ తినక తప్పదు. వారాంతాల్లో మరింతగా రిలాక్స్ అవ్వడానికి హోటల్ ఫుడ్‌ని ఆశ్రయిస్తారు. ఆ టైంలో కొత్త రుచులు తినడానికి ఆసక్తి చూపిస్తారు. ఫుడ్ లవర్స్ కోసమే రకరకాల పేర్లతో.. సరికొత్త వంటలతో అనేక హోటల్స్ ఆహ్వానం పలుకుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో  ‘రైల్ కోచ్ రెస్టారెంట్’ ప్రారంభమైంది. దక్షిణ మధ్య రైల్వే ఈ హోటల్‌ను ఓపెన్ చేసింది.

The Bank Tavern : ఈ రెస్టారెంట్‌లో లంచ్ చేయాలంటే నాలుగేళ్లు వెయిట్ చేయాల్సిందే .. మరి అంత స్పెషల్ ఏంటో తెలుసా..?

‘రైల్ కోచ్ రెస్టారెంట్’ లో రైలు బోగీలో కూర్చుని భోజనం తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే వినియోగంలో లేని పాత బోగీని రెస్టారెంట్ లాగ తీర్చిదిద్దారు. కస్టమర్లకు కొత్త అనుభూతిని కలిగించడమే కాదు.. తమ రెస్టారెంట్‌లో రుచులు కూడా ప్రత్యేకమని రైల్ కోచ్ రెస్టారెంట్ చెబుతోంది. ఇప్పటికే కాచీగూడ రైల్వే స్టేషన్ లోనూ ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే ఈ రెస్టారెంట్‌ నిర్వహణను నగరానికే చెందిన బూమరాంగ్ రెస్టారెంట్‌కి అప్పగించింది. ఇక ఆలస్యమెందుకు కొత్త అనుభూతితో పాటు సరికొత్త రుచుల్ని ఆస్వాదించడానికి చలో రైల్ కోచ్ రెస్టారెంట్.