అనధికార స్థలాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు.. మూసీ ఆక్రమణలో ఉన్నవారికి డబుల్ బెడ్రూం ఇళ్లు: మంత్రి శ్రీధర్ బాబు

మూసీలో మంచి నీరు ప్రవహించాలని తాము ప్రయత్నం చేస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు.

అనధికార స్థలాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు.. మూసీ ఆక్రమణలో ఉన్నవారికి డబుల్ బెడ్రూం ఇళ్లు: మంత్రి శ్రీధర్ బాబు

Duddilla Sridhar Babu

Updated On : September 29, 2024 / 4:26 PM IST

హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కీలక విషయాలు తెలిపారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చెరువుల రక్షణ కోసం తమ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.

మూసీ ఆక్రమణలో ఉన్న ప్రతి ఇక్కరికి ప్రత్యామ్నాయ సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. పేదలకు కాంగ్రెస్ ఎన్నడూ అన్యాయం చేయలేదని, ఎప్పటికీ చేయబోదని అన్నారు. మూసీ ఆక్రమణలో ఉన్న పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు.

మూసీలో మంచి నీరు ప్రవహించాలని తాము ప్రయత్నం చేస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. బీఆర్ఎస్ నేతలు మూసీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. హైడ్రాతో పేదవారికి ఎటువంటి ఇబ్బందులూ ఉండవని చెప్పారు. హైడ్రాతో పేద, మధ్య తరగతి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.

అనధికార స్థలాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తప్పవని శ్రీధర్ బాబు అన్నారు. అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మల్లన్న సాగర్ రైతుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసని అన్నారు. మల్లారెడ్డి అనే రైతు చితిపెట్టుకుని ఆహుతి అయ్యారని చెప్పారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని తాము నిరసన చేస్తే తమను అరెస్ట్ చేయలేదా అని నిలదీశారు.

Danam Nagendar: హైడ్రా కూల్చివేతలపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు..