Food Poison : విద్యార్థి ప్రాణం తీసిన పులిహోర.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ పై ఐపీసీ సెక్షన్ 153 A, 295A కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Food Poison : విద్యార్థి ప్రాణం తీసిన పులిహోర.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

Food Poison : యాదాద్రి జిల్లా భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలో విషాదం చోటు చేసుకుంది. ఒక విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రశాంత్ అనే విద్యార్థి చనిపోయాడు. ఈ నెల 12 న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. బ్రేక్ ఫాస్ట్ లో పులిహోర తిన్న తర్వాత 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పలువురికి భువనగిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ కు తరలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రశాంత్ మరణించాడు.

మృతి చెందిన విద్యార్థి పోచంపల్లి మండలం జిబ్ లక్ పల్లి గ్రామ వాసి. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ పై ఐపీసీ సెక్షన్ 153 A, 295A కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Also Read : 270 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన.. బెంగళూరు మహిళకు రూ.1.36 లక్షల జరిమానా..!