బాబోయ్.. బిర్యానీలో కప్ప..! గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో షాకింగ్ ఘటన..
మెస్ ఇంఛార్జ్ కు దీనిపై ఫిర్యాదు చేశారు.

Frog In Biryani (Photo Credit : Google)
Frog In Biryani : హైదరాబాద్ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో షాకింగ్ ఘటన జరిగింది. విద్యార్థులు ఆర్డర్ చేసిన బిర్యానీలో కప్ప దర్శనమిచ్చింది. క్యాంపస్ లోని కదంబ మెస్ లో విద్యార్థులు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అందులో కప్ప రావడంతో కంగుతిన్నారు. కప్ప ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెస్ ఇంఛార్జ్ కు దీనిపై ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న ఈ ఘటన జరిగింది.
అటు ఆదిలాబాద్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న తనిఖీల్లో భాగంగా ఆదిలాబాద్ లోని పలు హాటల్స్, స్వీట్ షాప్స్ లో సోదాలు జరిపారు. నిషేధ రంగులతో పాటు కుళ్లిన మాంసాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. నిబంధనలను పాటించని హోటల్స్, స్వీట్ షాపుల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు.
అటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు హోటల్స్, స్వీట్ దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ, టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో కుళ్లిన మాంసం, నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలను అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పాటించని లహరి, వంశీ ఇంటర్నేషనల్ హోటల్స్ కు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ వాలా స్వీట్ హోమ్ దుకాణంలో అపరిశుభ్ర వాతావరణం కనిపించడంతో నోటీసులు జారీ చేశారు అధికారులు. మొత్తం ఐదుగురు సభ్యుల టీమ్ తో హోటల్స్ లో రైడ్స్ చేశారు అధికారులు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని అధికారులు హెచ్చరించారు.
Also Read : అత్యధిక పేదలున్న దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా.. ఎంత మంది పేదరికంలో జీవిస్తున్నారంటే?