పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ కుమార్తె

MLC TRS candidate for graduation Surabhi Vanidevi : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. మాజీ ప్రధాని నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి టీఆర్ఎస్ టికెట్ కేటాయించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభి వాణీదేవిని ఎంపిక చేశారు. రేపు ఎమ్మెల్సీ అభ్యర్థినిగా వాణీదేవి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ తో తరచుగా వాణీదేవి భేటీ అయ్యారు. అప్పట్లోనే ఆమెకు టీఆర్ఎస్ లో ఏదో ఒక పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని బలంగా ఎదుర్కొనేందుకు పీవీ కుమార్తె వాణీదేవిని కేసీఆర్ రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.
శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్‌కు వాణీదేవి ఫౌండర్‌గా ఉన్నారు. ప్రముఖ విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా, చిత్రకారిణిగా ఆమెగా గుర్తింపు తెచ్చుకున్నారు. అన్ని రంగాల్లో మంచి పేరు సంపాదించిన వాణీదేవిని సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థినిగా ప్రకటించారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు చేదోడు.. వాదోడుగా వాణీదేవి ఉండేవారు.