Telangana : సూర్యాపేటలో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ సిబ్బంది నిర్వాకం..బాత్రూమ్, డ్రెస్సింగ్ రూముల్లో కెమెరా

సూర్యాపేటలో ఓ ప్రైవేటు స్విమ్మింగ్ పూల్ సిబ్బంది నిర్వాకం బయటపడింది. బాత్రూమ్, డ్రెస్సింగ్ రూముల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చిన ఘటన బయటపడింది. బాత్రూమ్ లో సెల్‌ఫోన్ కెమెరాతో రహస్యంగా యువతులను చిత్రీకరిస్తున్న యువకుడి బండారం బయటపడింది.

Telangana : సూర్యాపేటలో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ సిబ్బంది నిర్వాకం..బాత్రూమ్, డ్రెస్సింగ్ రూముల్లో కెమెరా

Young Man Secretly Records Women While They Changing Dress

Updated On : May 6, 2022 / 10:29 AM IST

Telangana :  సూర్యాపేటలో ఓ ప్రైవేటు స్విమ్మింగ్ పూల్ సిబ్బంది నిర్వాకం బయటపడింది. బాత్రూమ్, డ్రెస్సింగ్ రూముల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చిన ఘటన బయటపడింది. బాత్రూమ్ లో సెల్‌ఫోన్ కెమెరాతో రహస్యంగా యువతులను చిత్రీకరిస్తున్న యువకుడి బండారం బయటపడింది. దీంతో ఓ యువతి తల్లిదండ్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చివ్వెంల మండలం కుడకుడ గ్రామ పరిధిలోని ఓ ఈత కొలనులో గుగులోతు మహేశ్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. మంగళవారం (మే3,2022) తన మొబైల్ కెమెరాను ఆన్‌చేసి రహస్యంగా అక్కడి స్నానాల గదిలో పెట్టాడు.

అదే రోజు ఇద్దరు యువతులు స్నానాల గదిలో దుస్తులు మార్చుకుంటున్న సమయంలో అనుమానంతో పరిశీలించగా కెమెరా ఆన్‌‌చేసి ఉన్న మొబైల్ ఫోన్ కనిపించింది. దీంతో యువతులు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.