త‌బ్లిగీ క్లస్టర్‌ను దాటేసిన కోయంబేడు మార్కెట్ కరోనా కేసులు

  • Published By: srihari ,Published On : May 11, 2020 / 05:16 AM IST
త‌బ్లిగీ క్లస్టర్‌ను దాటేసిన కోయంబేడు మార్కెట్ కరోనా కేసులు

Updated On : June 26, 2020 / 8:41 PM IST

భారతదేశంలో కరోనా కేసులు భారీగా పెరగడానికి ప్రధాన కారణమైన తబ్లిగీ క్లస్టర్‌ను మించి తమిళనాడులో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కోయంబేడు కూరగాయల మార్కెట్ దేశంలోనే అతిపెద్ద కరోనా హాట్ స్పాట్‌గా మారిపోయింది. రోజురోజుకీ కోయంబేడు నుంచి వందల సంఖ్యలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ఆదివారం (మే 10) తమిళనాడులో 669 కేసులు నమోదు కాగా, మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,204కు చేరింది. ఈ కేసులన్నీ కోయంబేడు మార్కెట్‌తో కారణంగానే నమోదైనట్టు అధికారులు గుర్తించారు.

ఢిల్లీ నిర్వహించిన వివాదస్పద తబ్లిగీ జమాత్ సదస్సుతో దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. శనివారం సాయంత్రానికి సేకరించిన సమగ్ర డేటా ప్రకారం.. దేశంలో ఇతర మార్గాల్లో నమోదైన 1,350ల కంటే కోయంబేడు క్లస్టర్‌తో సంబంధం ఉన్న కరోనా కేసులు 2,005‌కు చేరాయి. తబ్లిగీ క్లస్టర్ నుంచి 631 ప్రైమరీ కాంటాక్టుల ద్వారా వైరస్ సోకితే.. సెకండరీ కాంటాక్టులతో 719 వరకు నమోదయ్యాయి. కోయంబేడు క్లస్టర్ లో ప్రైమరీ కాంటాక్టు కేసుల సంఖ్య 875 వరకు నమోదయ్యాయి. వీరి నుంచి మరో 1,130 మందికి కరోనా ఇన్ఫెక్షన్ సోకినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ డేటాను వెల్లడించింది. 

విదేశాలకు వెళ్లొచ్చినవారిలో మొత్తం 715 మందికి కరోనా వైరస్ సోకితే.. వారిద్వారా ఇతర రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఒకరి నుంచి మరొకరికి మొత్తంగా 2464 కేసులు నమోదైనట్టే డేటా సూచిస్తోంది. తబ్లిగీ సభ్యులతో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. ఇప్పుడు చెన్నైలో నమోదైన మొత్తం కేసుల్లో సగానికి పైగా కోయంబేడు వెజిటేబుల్ మార్కెట్ హాట్ స్పాట్లో నుంచే నమోదయ్యాయి. చెన్నై నగరంలో ఆదివారం రోజున 509 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో మొత్తంగా 7,204 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆదివారం సాయంత్రానికి మెట్రో పోలిస్ నుంచి 3,839 వరకు కేసులు నమోదైనట్టు ప్రభుత్వ డేటా సూచిస్తోంది. 

Read Here>> ‘వందే భారత్‌’ విమానాలకు మహిళా కెప్టెన్లు