Vijay meet KCR: సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ స్టార్ హీరో విజయ్

తమిళ స్టార్ హీరో విజయ్ సీఎం కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. బుధ‌వారం హైద‌రాబాద్ వ‌చ్చిన హీరో విజ‌య్..నేరుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లి కేసీఆర్‌ను క‌లిశారు.

Vijay meet KCR: సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ స్టార్ హీరో విజయ్

Vijay

Updated On : May 18, 2022 / 10:31 PM IST

Vijay meet KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బుధవారం అనుకోని అతిధి కలిశారు. తమిళ స్టార్ హీరో విజయ్ సీఎం కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. బుధ‌వారం హైద‌రాబాద్ వ‌చ్చిన హీరో విజ‌య్..నేరుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లి కేసీఆర్‌ను క‌లిశారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విజయ్ ను ఆహ్వానించి సీఎం వద్దకు తీసుకెళ్లారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్..హీరో విజయ్ కి పుష్ప గుచ్ఛం అందించి శాలువతో సత్కరించారు.

విజయ్ వెంట సినీ దర్శకుడు వంశి పైడిపల్లి కూడా ఉన్నారు. విజయ్, వంశి కలయికలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈక్రమంలో షూటింగ్ నిమిత్తమే విజయ్ హైదరాబాద్ వచ్చి ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ భేటీలో సీఎం కేసీఆర్, విజయ్ దేని గురించి చర్చించారనే విషయం మాత్రం తెలియరాలేదు.

Other Stories:Telugu New Films: రాబోయే సినిమాల్లో సందడి చేయనున్న క్రేజీ కపుల్స్!