Tammineni Veerabhadram: బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ రాజకీయాలను స్వాగతిస్తున్నాం.. మునుగోడు ఉపఎన్నిక వరకే మా మద్దతు..
బీజేపీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను స్వాగతిస్తున్నామని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. అయితే తెరాసకు మునుగోడు ఉపఎన్నిక వరకే తమ మద్దతు అని అన్నారు.

Tammineni veerabadhram
Tammineni Veerabhadram: బీజేపీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను స్వాగతిస్తున్నామని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాసకు సీపీఎం మద్దతు ఇస్తుందని ప్రకటించారు. సీపీఐలా తాము దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోలేదని, మునుగోడు ఉప ఎన్నిక వరకే సీపీఎం తెరాసకు మద్దతుఇస్తుందని తమ్మినేని అన్నారు.
Munugode bypoll : కాళ్లు మొక్కుడే కాదు..పొర్లు దండాలు పెట్టినా మునుగోడులో కాంగ్రెస్ గెలవదు
మునుగోడు నియోజకవర్గానికి తెరాస ప్రభుత్వం అన్యాయం చేసిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పాడని, కాంగ్రెస్ కు ఎందుకు రాజీనామా చేశారని తమ్మినేని ప్రశ్నించారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే నెలరోజుల్లో తెరాస ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పాడని, పూర్తి మెజార్టీతో ఉన్న ప్రభుత్వాన్ని ఎలా కూల్చుతారంటూ తమ్మినేని ప్రశ్నించారు. బీజేపీ రాజ్యాంగ సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ స్థానంలో ఉండేందుకు బీజేపీ ప్రణాళికలు వేస్తోందని, రాబోయే ఎన్నికలు తెరాస వర్సెస్ కాంగ్రెస్ మారే అవకాశాముందని తమ్మినేని అన్నారు.