నారా లోకేష్ కారు చెక్ చేసిన పోలీసులు

  • Published By: vamsi ,Published On : November 24, 2020 / 12:08 PM IST
నారా లోకేష్ కారు చెక్ చేసిన పోలీసులు

Updated On : November 24, 2020 / 12:27 PM IST

Nara Lokesh:తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కాన్వాయ్‍ని పోలీసులు తనిఖీ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి అమరావతికి బయలుదేరిన సమయంలో ఇంటికి కొద్ది దూరంలోనే సోదాలు నిర్వహించారు పోలీసులు. కాన్వాయ్‍లోని వాహనాన్ని హైదరాబాద్ పోలీసులు చెక్ చేసిన తర్వాత క్లియరెన్స్ ఇచ్చారు.

GHMC ఎన్నికల సమయంలో పోలీసులు ఎన్నికల కోడ్ ఉండటంతోనే చెక్ చేసినట్లుగా వెల్లడించారు. ఈ చెకింగ్స్ జరిగే సమయంలో లోకేష్ అక్కడ లేరు. తనిఖీలు నిర్వహించిన తర్వాత లోకేష్ కాన్వాయ్ అక్కడి నుంచి బయల్దేరి అమరావతికి వెళ్లింది.



https://10tv.in/ktr-fires-on-bjp-ghmc-elections-campaign/
జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎన్నిక‌ల కోడ్‌ అమ‌లులో ఉండగా.. రాజ‌కీయ నేత‌లు, వీఐపీ, వీవీఐపీల వాహ‌నాల‌ను తెలంగాణ పోలీసులు చెక్ చేస్తున్నారు. పోలింగ్‌కు స‌మ‌యం దగ్గ‌ర‌ ప‌డగా.. పోలీసు శాఖ చెకింగ్‌ను ముమ్మ‌రం చేసింది. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్వి నారా లోకేశ్ కాన్వాయ్‌ను పోలీసులు త‌నిఖీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీడీపీ కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 95 స్థానాల్లో పోటీ చేస్తుంది ఆ పార్టీ.