Ravula Chandrasekhar Reddy : బీఆర్ఎస్‌లో చేరనున్న టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి..?
తెలంగాణ టీడీపీకి మరో భారీ షాక్ తగలనుందా..? మరో సీనియర్ నేత పార్టీని వీడనున్నారా..?మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి సైకిల్ కి గుడ్ బై చెప్పి కారు ఎక్కనున్నారా..?

Ravula Chandrasekhar Reddy
TDP senior leader Ravula Chandrasekhar Reddy : తెలంగాణ టీడీపీకి మరో భారీ షాక్ తగలనుందా..? మరో సీనియర్ నేత పార్టీని వీడనున్నారా..? టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి సైకిల్ కి గుడ్ బై చెప్పి కారు ఎక్కనున్నారా..? అంటే నిజమేనిపిస్తోంది. టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. రావుల పార్టీ మారతారని వార్తలు ఎన్నికల వేళ బాగా హల్ చల్ చేశాయి. కానీ ఎట్టకేలకు టీడీపీని వీడేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా పక్కా సమాచారం.
రావుల కాంగ్రెస్ లో చేరతారే వార్తలు వచ్చాయి. కానీ ఆయన బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. రేపే బీఆర్ఎస్ లో చేరుతున్నారని సమాచారం. రావుల పార్టీ మారతారనే సమాచారంతో కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు మంతనాలు సాగించింది. కానీ ఆయన మాత్రం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం.
Kishan Reddy : కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే : కిషన్ రెడ్డి
కాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయా పార్టీల నేతలు టికెట్ల కోసం తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి..కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి ఇలా నేతలు జంపింగ్ లు కొనసాగుతున్నాయి. ఎన్నికల వేళ ఇదంతా సర్వసాధారణమే. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీలు మారటం కొనసాగుతోంది. దీంతో రావుల కూడా గతంలో పార్టీలు మారిన నేతల బాటే పట్టాలని భావించారు. దీంతో బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దీని కోసం రావుల బీఆర్ఎస్‌కు చెందిన ముఖ్య నేతలతో ఆయన చర్చించినట్లుగా సమాచారం.