Pawan Kalyan: రేపు కొండగట్టుకు పవన్ కల్యాణ్.. ఆ నిర్మాణాలకు శంకుస్థాపన.. ఇకపై 2వేల మంది ఒకేసారి
శంకుస్థాపన అనంతరం తెలంగాణకు చెందిన జనసేన రాష్ట్ర నాయకులు, శ్రేణులతో పవన్ కల్యాణ్ సమావేశం అవుతారు.
Pawan Kalyan Representative Image (Image Credit To Original Source)
- కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్న పవన్ కల్యాణ్
- పవన్ చొరవతో కొండగట్టు క్షేత్రానికి రూ.35 కోట్ల నిధులు మంజూరు చేసిన టీటీడీ
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి వెళ్లనున్నారు. అక్కడ సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ చొరవతో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొండగట్టు ఆలయానికి నిధులు మంజూరు చేసింది. రూ.35.19 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపట్టనున్నారు. ఒకేసారి 2వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం నిర్మించనున్నారు.
శంకుస్థాపన అనంతరం జనసేన కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. తెలంగాణకు చెందిన జనసేన రాష్ట్ర నాయకులు, శ్రేణులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన వారితోనూ పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్ట్‌లో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు.
Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ గ్రామాల పరిధిలోని ప్రజలకు భారీ శుభవార్త
