TS SSC : పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2021, మే 21వ తేదీ శుక్రవారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష ఫీజును చెల్లించిన 5 లక్షల 21 వేల 073 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరికి గ్రేడ్లు కేటాయించారు.

10th Class
10th Class Results : తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2021, మే 21వ తేదీ శుక్రవారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష ఫీజును చెల్లించిన 5 లక్షల 21 వేల 073 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరికి గ్రేడ్లు కేటాయించారు. ఆయా సబ్జెక్టులలో వచ్చిన మార్కుల ఆధారంగా..గ్రేడింగ్, గ్రేడింగ్ పాయింట్లు ఇచ్చారు.
అన్నీ సబ్జెక్టులకు కలిపి గ్రేడ్ పాయింట్ యావరేజ్ గా నిర్ణయంచారు. కరోనా కారణంగా..ఈ సంవత్సరం కూడా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఫలితాలు విడుదల చేసిన అనంతరం మంత్రి సబిత మాట్లాడుతూ… మొత్తం 2 లక్షల 10 వేల 647 మంది GPA సాధించినట్లు వెల్లడించారు. మొత్తం 535 పాఠశాలలు జీపీఏ సాధించాయన్నారు. ఇక ఫలితాలు bse.telangana.gov.in చూడవచ్చు.
మార్చిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడగా, ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది. అంతర్గత మూల్యాంకనం మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పదో తరగతి విద్యార్థులు తమ తమ గ్రేడ్లను చూసుకునేందుకు మొదట bse.telangana.gov.inలోకి లాగినై, టీఎస్ ఎస్ఎస్‌సీ గ్రేడ్‌లు 2020 క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫలితాల పేజీ వస్తుంది. అనంతరం హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి, సబ్మిట్ చేస్తే గ్రేడింగ్‌ను చూపిస్తుంది. వీటిని ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
Read More : Girlfriend’s Wedding: ప్రియురాలి పెళ్లి ఆపేందుకు ఏకంగా సీఎంకే ట్వీట్