మళ్లీ తెలంగాణ అసెంబ్లీ..రెండు రోజులే!

  • Published By: madhu ,Published On : October 8, 2020 / 01:16 PM IST
మళ్లీ తెలంగాణ అసెంబ్లీ..రెండు రోజులే!

BJP MLA's

Updated On : October 8, 2020 / 1:31 PM IST

Telangana Assembly : మళ్లీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే సోమ, మంగళవారాల్లో సమావేశాలు జరుపాలని అనుకొంటోంది. జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హైకోర్టు సూచించిన అంశాల్లో మార్పులు చేయాలని యోచిస్తోంది. ఇందుకు అసెంబ్లీని సమావేశ పరచాలని భావిస్తోంది.



2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మున్నిపల్ ఎన్నికల సందర్భంగా ఇద్దరు పిల్లలకంటే..పోటీ చేసే అభ్యర్థులకు నిబంధనలు తొలగించే అవకాశం ఉంది. సమావేశాలను నిర్వహించి..గ్రీన్ సిగ్నల్ ఇస్తే..జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఇతర కార్పొరేషన్ ఎన్నికల నిర్వాహణ సులువవుతుందని భావిస్తోంది.



ఇటీవలే జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో అసెంబ్లీ సమావేశాల గురించి సీఎం కేసీఆర్ వెల్లడించినట్లు సమాచారం. రెవెన్యూ చట్టంపై కూడా చర్చిస్తే..ప్రజల్లోకి సులువుగా వెళుతోందని ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు జరుపాలని అనుకొంటోంది.



గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకడంతో సమావేశాలు అనుకున్న గడువు కంటే ముందే ముగిశాయి.



2020, సెప్టెంబర్ 7వ తేదీన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిగాయి. 28వ తేదీ వరకు మొత్తం 18 వర్కింగ్​ డేస్​లో సమావేశాలు నిర్వహించాలని అసెంబ్లీ, కౌన్సిల్​ బీఏసీల్లో నిర్ణయించారు. అసెంబ్లీలో 8 బిల్లులు, కౌన్సిల్​లో 4 బిల్లులు పాస్​ అయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్తున్న రెవెన్యూ బిల్లు రెండు సభల్లో ఆమోదం పొందింది. బిల్లులన్నీ ఆమోదం పొందడంతో సెప్టెంబర్ 16వ తేదీన సమావేశాలు ముగిశాయి.