Telangana assembly session 2023: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటల సీట్ వద్దకు వెళ్ళి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న కేటీఆర్.. Live Update
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి అసెంబ్లీ సంతాపం.

TS assembly session
Telangana assembly session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
LIVE NEWS & UPDATES
-
అసెంబ్లీ లోపల ఆసక్తికర సన్నివేశం..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లోపల ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీట్ వద్దకు వెళ్ళి మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఒకరినొకరు హత్తుకున్న నేతలు. పదినిమిషాల పాటు మాట్లాడుకున్న కేటీఆర్, ఈటల రాజేందర్.
-
మరికొద్ది సేపట్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్నిరోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి? ఏఏ అంశాలపై చర్చించాలనే అంశాలను నిర్ణయించనున్నారు.
-
అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన రావు, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు.
-
సభ రేపటికి వాయిదా ..
సాయన్నతో ఉన్న అనుబంధాన్ని సభలో పలు పార్టీల సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. సాయన్న మృతికి శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి(శుక్రవారం) వాయిదా పడింది.
-
సాయన్న లేని లోటును తీర్చలేనిది. సాయన్న పేదల సంక్షేమం కోసం కృషి చేశారు. అనునిత్యం ప్రజల్లో వ్యక్తి సాయన్న అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
-
సాయన్న పేదల పక్షపాతి. ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏ బాధ్యత తీసుకున్నా అంకితభావంతో పనిచేశారు. సాయన్న మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని భట్టి విక్రమార్క అన్నారు.
-
సాయన్న కటుంబానికి అండగా ఉంటాం.. సీఎం కేసీఆర్
సాయన్న కుటుంబం మా కుటుంబం. అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం కేసీఆర్ అన్నారు. సాయన్న నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవలందించారు. సాయన్న లోటు తీర్చలేనిది. కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో కలపాలని చివరి వరకు కృషి చేశారు. కంటోన్మెంట్‌లో ఉండటం వల్ల ఎలాంటి సౌకర్యాలు అందడం లేదని చెప్పేవారు. సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ అన్నారు.
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి అసెంబ్లీ సంతాపం. సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.
-
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి వర్షాకాలం సమావేశాల్లో వనమా హాజరుతారా లేక జలగం అటెండ్ అవుతారా అనే విషయంపై క్లారిటీ రానుది.
-
శాసనసభ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలో బీఏసీలో నిర్ణయిస్తారు. ప్రస్తుతం సమాచారం మేరకు ఏడు పనిదినాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, 20 రోజులు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పట్టుబడుతుండగా, 30రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ప్రజా సమస్యలపై సంపూర్ణ చర్చ నిర్వహించాలని బీజేపీ పేర్కొంటుంది.
-
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇటీవల మంత్రివర్గం ఆమోదించగా.. దీనికి సంబంధించిన బిల్లును ఈ సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను కూడా తిరిగి సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
-
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే సమావేశాలు కావడంతో ఈసారి సభాపర్వం అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య మాటల యుద్ధానికి వేదిక అయ్యే అవకాశం ఉంది.
-
శాసన మండలిలో విద్యుత్ శాఖ, హార్టికల్చర్, ఐటీ వార్షిక నివేదికలను మంత్రులు మండలిలో ప్రవేశపెట్టనున్నారు.
-
శాసన మండలిలో మాజీ ఎమ్మెల్సీ వేదల వెంకటనర్సింహాచారి మృతికి సంతాపం తెలపనున్నారు. అనంతరం ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలు, చేపట్టిన సహాయ చర్యలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. శాసనసభలో దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆ తరువాత సభ వాయిదా పడుతుంది. అనంతరం జరిగే శాసన సభ సలహా మండలి సమావేశంలో సభలో చర్చించాల్సిన అంశాలు, సభను ఎన్నిరోజులు నడపాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటారు. స్పీకర్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు పాల్గొంటారు.