Telangana Assembly Session 2023: కేటీఆర్ చేపట్టిన చర్యల వల్లే నష్టం బాగా తగ్గింది: మంత్రి వేముల.. live updates
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ముగిశాయి.

Telangana assembly session
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ముగిశాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలపై సభలో చర్చించారు.
LIVE NEWS & UPDATES
-
పరిహారం ప్రకటించాలి: అక్బరుద్దీన్
వరదల్లో నష్టపోయిన వారికి పరిహారం ప్రకటించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. వరదల్లో 42 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పత్రికల్లో వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ ప్రకటనల్లో మాత్రం మృతుల గురించి వివరాలు లేవని విమర్శించారు.
-
కేటీఆర్ చేపట్టిన చర్యల వల్లే..
వ్యూహాత్మక నాలాల అభివృద్ధి వల్ల జీహెచ్ఎంసీలో వర్షాకాలంలో నష్టాలను తగ్గించగలిగామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ చేపట్టిన చర్యల వల్ల నష్టం బాగా తగ్గిందని చెప్పారు. బాధితులకు కేంద్ర సర్కారు సాయం చేసినా, చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని తెలిపారు.
-
మూడోసారి కూడా సీఎంగా కేసీఆరే గెలుస్తారు.. మంత్రి కేటీఆర్
-
ఈటెలపై కేటీఆర్ సెటైర్లు ..
రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై సెటైర్లు వేశారు. రాజేందర్ మంత్రిగా ఉన్న హుజూరాబాద్‌లో ఐటీ కంపెనీ ఉంది. ఇప్పుడు ఉందో లేదో తెలియదు అంటూ కేటీఆర్ అన్నారు. స్పందించిన ఈటల లేదంటూ పేర్కొన్నాడు. నువ్వు బీజేపీలోకి వెళ్ళావు.. ఐటీ కంపెనీ మూత పడిందంటూ కేటీఆర్ ఈటెలను ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు.
-
తెలంగాణ అసెంబ్లీలో ఐటీ ఎగుమతులపై ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ చెప్పారు. ఈ రోజు ఎకరం భూమి ధర 100 కోట్లకు రికార్డు స్థాయిలో పెరిగిందంటే అషామాషీ కాదు. స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్ షిప్ ఉండటం వల్లే ఇది సాధ్యం అయిందని కేటీఆర్ అన్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన రజినీకాంత్ తాను న్యూయార్క్ లో ఉన్నానా? హైదరాబాద్ లో ఉన్నానో తెలియడం లేదని అన్నారు అంటూ కేటీఆర్ చెప్పారు. అయితే, బయట ఈ కుంభకోణం ఆ కుంభకోణం అంటూ కాంగ్రెస్ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్..
-
హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు గతకంటే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కానీ, తెలంగాణలోని ప్రతిపక్ష నేతలకు మాత్రం ఆ అభివృద్ధి కనిపించడం లేదని, వారు కంటి వెలుగు కార్యక్రమంలో ఓసారి వారి కళ్లను చూపించుకోవాలంటూ కేటీఆర్ హితవు పలికారు.
-
తెలంగాణ ఏర్పడిన తరువాత హైదరాబాద్ కు ఎన్నో గొప్ప సంస్థలు వచ్చాయని కేటీఆర్ అన్నారు. వాటిలో ఆపిల్, గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ప్రత్యక్షంగా 3,23,396 మంది ఉద్యోగాలు ఉండేవని, తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్తగా ఆరు లక్షల ఉద్యోగాలను సృష్టించడం జరిగిందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
-
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటైన నాటికి తెలంగాణ నుండి ఐటీ ఎగుమతులు 57,258 కోట్లుగా ఉండేవని చెప్పారు. అయితే, 2022- 2023 ఆర్థిక సంవత్సరానికి ఐటీ ఎగుమతులు 2,41,275 కోట్లుగా ఉన్నాయని అన్నారు. 2022- 2023 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 31.44శాతం ఐటీ ఎగుమతులు పెరిగాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
-
తమను రెగ్యులరైజేషన్ చేయాలని అసెంబ్లీని ముట్టడించిన ఏఎన్ఎం ఉద్యోగులు. ఏఎన్ఎంలను అరెస్టు చేసిన పోలీసులు.
-
అకాల వర్షాలు, వరద సహాయంపై శాసనసభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అదేవిధంగా గ్రామపంచాయతీలలో కార్మికుల సమస్యలపై శాసనమండలిలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది.
-
తెలంగాణలో వరదల తరువాత జరిగిన పునరావాస కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చిన సహాయక చర్యలపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
-
రెండోరోజు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.
-
మంత్రులకు అదనపు బాధ్యతలు..
అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల సందర్భంగా మంత్రులకు అదనపు శాఖల బాధ్యతలు అప్పగించారు. ఉభయ సభల్లో ఆయా శాఖలకు సంబంధించిన ప్రశ్నోత్తరాలు, చర్చల సందర్భంగా మంత్రులు సమాధానాలు ఇస్తారు.
వేముల ప్రశాంత్ రెడ్డికి అదనంగా రెవెన్యూ.
కేటీఆర్‌కు గనులు, భూగర్భ వనరులు, సమాచార పౌరసంబంధాల శాఖ.
మంత్రి హరీష్ రావుకు నీటిపారుదల శాఖ, సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, ప్రణాళిక శాఖలు.
తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు వాణిజ్య పన్నులశాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు.
ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు బులెటిన్ విడుదల చేశారు.
-
సభలో ప్రవేశపెట్టే బిల్లులు ..
- ది తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బిల్ 2023 ను ప్రవేశపెట్టనున్న ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు.
- ది ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ బిల్ 2023ను ప్రవేశపెట్టనున్న కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి.
- తెలంగాణ మైనార్టీ కమిషన్ చట్ట సవరణ బిల్లు 2023ను ప్రవేశపెట్టనున్న మంత్రి కొప్పుల ఈశ్వర్.
- తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు 2022ను రీ కన్సిడరేషన్కోసం సభలో ప్రవేశ పెట్టనున్న మంత్రి కేటీఆర్.
- తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రెగ్యులేషన్ చట్ట సవరణ బిల్లు-2022 రీకన్సిడరేషన్ కోసం సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు.
- తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ - 2022ను సభలో రికన్సిడరేషన్‌కోసం ప్రవేశపెట్టనున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు - 2023ను రిఫరెన్స్ కోసం సభలో ప్రవేశపెట్టనున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
- గవర్నర్ తిరస్కరణకుగురై వెనక్కి వచ్చిన నాలుగు బిల్లులను వెంటనే సభలో ఆమోదానికి కోరనున్న ఆయా శాఖల మంత్రులు.
-
ఏడు కీలక బిల్లులు ..
రెండో రోజు అసెంబ్లీలో ప్రభుత్వం ఏడు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. ఇందులో నాలుగు బిల్లులు గతంలో ఉభయ సభలలో చర్చించి ఆమోదించి గవర్నర్ సంతకం కోసం పంపితే.. వెనక్కి వచ్చిన బిల్లులు ఉన్నాయి.
-
రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చ ..
శాసనసభలో రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. రాష్ట్రంలో అధిక వర్షపాతంవల్ల కలిగే ఇబ్బందులు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై చర్చ జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల బలోపేతంకోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సాధించిన పురోగతిపై చర్చ జరుగుతుంది.
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండోరోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ, మండలిలో ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు మొదలవుతాయి. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఉభయ సభల ముందు ఉంచుతారు.