చలో అసెంబ్లీకి BJP పిలుపు : లీడర్స్ హౌస్ అరెస్టు

Telangana Assembly : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చలో అసెంబ్లీకి బీజేపీ పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తోంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
కీలక బీజేపీ నేతల ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. వారిని బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఎమ్మెల్సీ రాంచంద్రరావు, మోత్కుపల్లి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ప్రత్నామ్నాయంగా ఎదగాలని బీజేపీ ట్రై చేస్తోంది. జాతీయ అధినాయకత్వం ఈ రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా..ఇటీవలే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్ ను నియమించింది. అధ్యక్షుడిగా నియమితులైన అనంతరం క్రమంగా బీజేపీ వాయిస్ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఆందోళన కార్యక్రమాలు నిర్వహస్తోంది.
https://10tv.in/telangana-bjp-leaders-lobbying-for-national-level-posts/
కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వం విఫలం చెందిందంటూ ఇటీవలే బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఇప్పుడు సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలంటూ..బీజేపీ డిమాండ్ చేస్తోంది.
అంతేగాకుండా..పాఠ్యాంశాల్లో చేర్చాలని అంటోంది. అధికారంలోకి వచ్చాక..టీఆర్ఎస్ ఇచ్చిన మాటను మరిచిపోయిందని విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ ఇచ్చిన పిలుపుతో పోలీసులు అసెంబ్లీ ఎదుట భారీగా పోలీసులు మోహరించారు.