హస్తిన బాట పట్టిన తెలంగాణ బీజేపీ ఎంపీలు
తెలంగాణలో బీజేపీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు ఢిల్లీకి పయనమయ్యారు.

Telangana BJP MPs: తెలంగాణలో బీజేపీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు ఢిల్లీకి పయనమయ్యారు. డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్, రఘనందనరావు, నగేష్, ధర్మపురి అర్వింద్ గురువారం ఢిల్లీ వెళ్లారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో జరిగే బీజేపీ ఎంపీల సమావేశానికి వీరు హాజరవుతారు.
అనంతరం సంవిధాన్ భవన్ సెంట్రల్ హాల్ లో ఎన్డీఏ పక్ష ఎంపీల సమావేశంలో పాల్గొంటారు. ఇదే సమావేశానికి బీజేపీ జాతీయ పదాధికారులు కూడా హాజరవుతారు. రేపు ఉదయానికి పార్టీ జాతీయ పదాథికారులు అంతా ఢిల్లీ చేరుకోవాలని ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం పంపించారు.
నేను ఎప్పుడూ రేసులో ఉండను: డాక్టర్ కె. లక్ష్మణ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తను ఏ బాధ్యత ఇచ్చిన నిర్వహిస్తానని బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. కేంద్రమంత్రి రేసులో ఉన్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. పార్టీ ఏది ఆదేశిస్తే అది నిర్వహిస్తా. నేను ఎప్పుడూ రేసులో ఉండను. ఎవరికీ ఏం ఇవ్వాలనేది పార్టీ నిర్ణయమని సమాధానమిచ్చారు.
Also Read: చేవెళ్లలో గెలుపుపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పెరగనున్న ఎన్డీఏ బలం!
స్వతంత్ర ఎంపీలను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. రేపు ప్రభుత్వ ఏర్పాటుకు పలువురు స్వతంత్ర ఎంపీలు మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం.