Bandi Sanjay Budget 2022 : ఇది విప్లవాత్మకమైన బడ్జెట్ – బండి సంజయ్

దేశానికి విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన బడ్జెట్ అందించారని.. ప్రధాని మోదీ, ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్.

Bandi Sanjay Budget 2022 : ఇది విప్లవాత్మకమైన బడ్జెట్ – బండి సంజయ్

Bandi Sanjay Budget 2022

Updated On : February 1, 2022 / 10:07 PM IST

Bandi Sanjay Budget 2022 : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. దేశానికి విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన బడ్జెట్ అందించారని బండి సంజయ్.. ప్రధాని మోదీ, ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు. కరోనా టైమ్ లో పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తారని మేధావులు, ఆర్థికవేత్తలు ఆవేదన చెందుతున్న ఈ తరుణంలో ట్యాక్స్ ఫ్రీ బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషకరం అన్నారు బండి సంజయ్. నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ దేశం కోసం జీవితాలను ధారపోస్తున్నారని, పైసా అవినీతి లేకుండా అహర్నిశలు పని చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు.

Union Budget 2022: బడ్జెట్ తర్వాత బూట్లు, బట్టల ధరలు తగ్గాయి.. ఏవి పెరిగాయో తెలుసా?

కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ విమర్శలను బండి సంజయ్ ఖండించారు. దళితుడు కాబట్టే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్.. దళిత వ్యతిరేకి అని విమర్శించారు. రాష్ట్రపతి దళితుడు కాబట్టే ఆయన ప్రసంగాన్ని బహిష్కరించారని అన్నారు. తన కొడుకుని సీఎం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్.. దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు అని ఆరోపించిన బండి సంజయ్.. కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం అని హెచ్చరించారు.

WhatsApp Alert : వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!

బడ్జెట్ లో రైతుల ప్రస్తావన లేదని కేసీఆర్ అంటున్నారు… ఎంఎస్ ఫీ కోసం ఈ ఏడాది రూ.2 లక్షల 37వేల కోట్లు.. గోధుములు, ధాన్యం కొనడానికి మాత్రమే బడ్జెట్ లో పెట్టారు. ఇది రైతుల బడ్జెట్ కాదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణలో రైతులు కోటీశ్వర్లు అయితే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలన్నారు. కేంద్రానికి ధాన్యం కొనే ఆలోచన లేకుండా ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఎందుకు కేటాయిస్తుందని కేసీఆర్ ని అడిగారు. 317 జీవో పేరుతో ఉద్యోగులను కేసీఆర్ అవమానిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. 317 జీవో మంచిదైతే 10మంది ఉద్యోగులు ఎందుకు సూసైడ్ చేసుకుంటారని నిలదీశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని కేసీఆర్ అనడం పచ్చి అబద్దం అన్నారు బండి సంజయ్. కొత్త ఉద్యోగాలిస్తానని ప్రతి ఎన్నికలప్పుడు ఊరిస్తున్నారు తప్ప నోటిఫికేషన్లు ఏవి? అని అడిగారు.