Telangana Cabinet : నేడే తెలంగాణ కేబినెట్ విస్తరణ, మంత్రివర్గం నుంచి ఒకరికి ఉద్వాసన?

అదే జరిగితే, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో ఒకరిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. Telangana Cabinet - CM KCR

Telangana Cabinet : నేడే తెలంగాణ కేబినెట్ విస్తరణ, మంత్రివర్గం నుంచి ఒకరికి ఉద్వాసన?

Telangana Cabinet Expansion (Photo : Google)

Updated On : August 24, 2023 / 12:12 AM IST

Telangana Cabinet – CM KCR : రేపు(ఆగస్టు 24) ఉదయం 11 గంటలకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. ఈ విస్తరణలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. మరో స్థానంలోకి గంప గోవర్ధన్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అదే జరిగితే, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో ఒకరిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలో ఒకరిని తప్పించే ఛాన్స్ ఉందంటున్నారు.

త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ మరింత దూకుడు మీదుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసేశారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Also Read..KCR Strategy: గులాబీ బాస్ టాప్‌గేర్.. కేసీఆర్ మార్కు చాణక్యం.. ఒకే దెబ్బతో అంతా సెట్!

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. మంత్రివర్గంలో ఉన్న ఒక ఖాళీని సీఎం కేసీఆర్ భర్తీ చేయనున్నారు. మాజీమంత్రి మహేందర్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. పట్నం మహేందర్‌రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.

ఈటల రాజేందర్‌ను తప్పించిన తర్వాత కొత్తగా ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు కేసీఆర్. ఖాళీగా ఉన్న ఆ స్థానంలోకి మహేందర్‌రెడ్డికి అవకాశం లభించిందని సమాచారం. ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్‌రెడ్డి తాండూరు నుంచి పోటీ చేయాలనుకోవడం, సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే ఇస్తామంటే ప్రత్యామ్నాయం చూసుకుంటానని పార్టీ దృష్టికి తెచ్చినట్లు కొన్నాళ్ల క్రితం ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నాయకులు జోక్యం చేసుకుని ఆయనతో చర్చించాక.. తాండూరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి విజయానికి సహకరించడానికి అంగీకరించారని తెలుస్తోంది.