CM KCR : ఢిల్లీకి సీఎం కేసీఆర్, వారంరోజులు మకాం

ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంపై వత్తిడి పెంచుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళుతున్నారు. ఆదివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన

CM KCR : ఢిల్లీకి సీఎం కేసీఆర్, వారంరోజులు మకాం

Cm Kcr Delhi Tour

Updated On : April 3, 2022 / 1:03 PM IST

CM KCR :  ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంపై వత్తిడి పెంచుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళుతున్నారు. ఆదివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్ళనున్నారు.

ధాన్యం కొనుగోలు అంశాన్ని  మరోసారి ఆయన కేంద్రాన్ని కోరనున్నారు. కేసీఆర్ వారం రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. ఈ సమయంలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ తో పాటు ఆయన భార్య శోభ, ఎమ్మెల్సీ కవిత వెళ్లనున్నారు.
Also Read : Banjara Hills CI : బంజారాహిల్స్ సీఐ శివచంద్ర సస్పెండ్
జైపూర్ పర్యటనలో ఉన్న ఎంపీ జే.సంతోష్ కుమార్ ఢిల్లీ వచ్చి కేసీఆర్ తో కలవనున్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై వీలైనంత ఎక్కువగా దేశవ్యాప్తంగా ఉన్నరైతుల మద్దతు కూడగట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈనెల 11న టీఆర్ఎస్ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఢిల్లీలో నిరసన చేపట్టనున్నారు.