CM KCR : కేంద్ర బడ్జెట్ కు దశ, దిశ లేదు : సీఎం కేసీఆర్

కేంద్ర ఆర్థికమంత్రి చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్ల తనంతో నిండి, మాటల గారడీతో ఉందన్నారు. కేంద్రం తమ జబ్బలు తామే చరుచుకుంటూ సామాన్యులను నిరాశ పర్చిందని పేర్కొన్నారు.

CM KCR : కేంద్ర బడ్జెట్ కు దశ, దిశ లేదు : సీఎం కేసీఆర్

Kcr (1)

Updated On : February 1, 2022 / 3:30 PM IST

CM KCR dissatisfaction on the union budget : కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. అన్ని వర్గాలను కేంద్ర బడ్జెట్ నిరాశపర్చిందన్నారు. కేంద్ర బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, దేశ రైతాంగం, పేదల్ని తీవ్ర నిరాశకు గురిచేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. బడ్జెట్ దశ, దిశ లేని పనికిమాలిన పసలేని బడ్జెట్ అని తీవ్ర విమర్శలు చేశారు.

కేంద్ర ఆర్థిక మంత్రి చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్ల తనంతో నిండి, మాటల గారడీతో కూడి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ సామాన్యులను నిరాశ నిస్పృహలకు గురి చేసిందని పెదవి విరిచారు. మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ గా ఆయన అభివర్ణించారు.

Vande Bharat Trains: 400 కొత్త వందే భారత్ రైళ్లు..!

వ్యవసాయ రంగాన్ని ఆదుకునేలా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని విమర్శించారు. దేశ వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ బిగ్ జీరో అని ఎద్దేవా చేశారు. చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టిందని విమర్శించారు. వైద్యం, ప్రజారోగ్యం, మౌలిక రంగాల్ని అభివృద్ధి పర్చలేదని ఆరోపించారు.

ఇన్ కంటాక్స్ లో శ్లాబ్ మార్చకపోవడం విచారకరం అన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోలేదన్నారు. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. కేంద్ర బడ్జెట్ పై ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.