కేసీఆర్.. లాక్‌డౌన్‌పై డౌట్లు తీర్చేశార్..మే 7వరకూ పొడిగింపు

కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి విధించిన లాక్‌డౌన్ పొడిగింపుపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. క్యాబినెట్ మీటింగ్ అనంతరం ప్రగతి భవన్ వేదికగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. కిరాయి ఇళ్లలో ఉండే వారి చెల్లింపులపై వివరణ ఇచ్చారు.

కేసీఆర్.. లాక్‌డౌన్‌పై డౌట్లు తీర్చేశార్..మే 7వరకూ పొడిగింపు

Kcr Locdown

Updated On : September 23, 2021 / 12:49 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి విధించిన లాక్‌డౌన్ పొడిగింపుపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. క్యాబినెట్ మీటింగ్ అనంతరం ప్రగతి భవన్ వేదికగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. కిరాయి ఇళ్లలో ఉండే వారి చెల్లింపులపై వివరణ ఇచ్చారు.

ఆ జిల్లాల్లో సున్నా కేసులు:

లేటెస్ట్ గా వచ్చిన రిపోర్టుల ప్రకారం.. కొత్తగా వచ్చిన 18మందితో కలిపి 858 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 186మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. చికిత్స తీసుకుంటున్న వారు 651 మంది.4 జిల్లాల్లో 0 కేసులు ఉన్నాయి. వరంగల్ రూరల్, సిద్ధిపేట, భువనగిరి, వనపర్తిలో కేసులు లేవు.

తెలంగాణనే మెరుగు:

దేశవ్యాప్తంగా చూస్తే 3.22 శాతం ఉంటే తెలంగాణలో 2.44శాతం ఉంది. మిలియన్ మందికి దేశ స్థాయిలో 284 మందిని పరీక్షిస్తుంటే తెలంగాణ 325మందిని పరీక్షిస్తుంది.

మందులకు తక్కువేం కాదు:

దేశంలో మెడికల్ పరికరాలు తక్కువగా ఉండేవి. తొలి కాన్ఫిరెన్స్ లో ప్రధాని కూడా అదే చెప్పారు. చివరి సారి ప్రెస్ మీట్ లో చెప్పినట్లు PPEలు లాంటి పరికరాలు అందుతున్నాయి. ప్రస్తుతం  ఈ వైరస్ ను అరికట్టడానికి చేస్తున్న ట్రీట్మెంట్ కు మన దగ్గర ఎక్కువ స్థాయిలోనే మందులు ఉన్నాయి.

ప్రసవానికి దగ్గరగా ఉన్న మహిళలకు, తలసేమియా, కిడ్నీ పేషెంట్లకు అందించాల్సిన డయాలసిస్ రోగులకు ట్రీట్మెంట్ లో ఇబ్బంది కలగకుండా సేవలు అందిస్తున్నారు.

 

చాలా దేశాలు ఇదే బాటలో :

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. సింగపూర్ లాంటి దేశాలు లాక్‌డౌన్ ఎత్తేసి మళ్లీ మొదలుపెడతున్నారు. 42దేశాల్లో చాలా రోజులుగా లాక్‌డౌన్ విధించారు. భారత ప్రభుత్వం మే3వరకూ పొడిగించింది.

కేంద్ర ప్రభుత్వం కొన్ని అంశాలపై సడలింపు ఇస్తున్నట్లు తెలిపారు. కానీ, తెలంగాణలో ఎటువంటి రిలాక్సేషన్లు లేవు. ఆరోగ్య శాఖ మే1 నుంచి కేసులు భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతుంది.

 

పాత నియమాలే:

ఆదివారం 450మందికి టెస్టులు చేస్తే 18మందికి పాజిటివ్ వచ్చింది. మే1కి తగ్గాలని కోరుకుందాం. మనం జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బతింటాం. తెలంగాణలో లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు చెప్పిన అంశాలే యథాతథంగా అమలవుతాయి. నిత్యవసర సరుకులు, కూరగాయలు అందుబాటులో ఉంటాయి.

ఆహార పరిశ్రమలు, నూనె ఫ్యాక్టరీలు, శానిటైజర్లు వంటివి పనిచేస్తాయి. కేంద్రం చెప్పిన సడలింపులు వర్తించవు. కేంద్రం కూడా దీనికి ఆమోదించింది. 1897జీవో ప్రకారం.. కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తాయి.

 

మెరుగయ్యాం:

విదేశీ ప్రయాణికుల అధ్యాయం ముగిసింది. దానిని విజయవంతంగా ముగించాం. ఆ సమయంలో క్వారంటైన్లో ఉన్న 26వేల మంది కూడా క్షేమంగా బయటపడ్డారు. ఆ తర్వాత మర్కజ్ నుంచి వచ్చిన వారి కేసులే ఇంకా నడుస్తున్నాయి. కొత్తగా వచ్చిన కేసులపై కూడా స్టడీ చేస్తున్నారు.

మనం నిర్లక్షం వ్యవహరిస్తే పెరిగే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం ప్రకటించిన దాని ప్రకారం.. మే3 వరకూ గడువు ఉంటుంది. నేనే ప్రత్యేకంగా సర్వే నిర్వహించి తెలుసుకున్నా. టీవీ ఛానెళ్ల వారి ఎలక్ట్రానిక్ సర్వే కూడా అదే చెప్పింది. వారంతా 90శాతం లాక్‌డౌన్ పొడిగించాలనే చెబుతున్నారు. 70-80మందితో మాట్లాడినా ఇదే మాట్లాడుతున్నారు.

 

మే7 వరకూ లాక్ డౌన్ పొడిగింపు:

క్యాబినెట్ చర్చ అనంతరం మే7 వరకూ లాక్ డౌన్ కొనసాగిస్తున్నాం. మే8 తర్వాత అన్ని సేవలు పునరుద్దరిస్తాం. అని సీఎం కేసీఆర్ చెప్పారు.

మే5న క్యాబినెట్ చర్చ పెట్టి మరోసారి సమీక్షించి మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తాం. కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.

నాలుగు రోజులు కష్టం ఓర్చుకుంటే సరిపోతుంది. ప్రాణం కంటే ఏదీ విలువైంది కాదు. మే7 వరకూ కఠినంగా ఉండండి. బయట నుంచి తినుబండారాలకు అనుమతుల్లేవు.

 

సామూహిక ప్రార్థనలకు నో పర్మిషన్:

పండగలు, ప్రార్థనలు ఇంటి నుంచే చేసుకోవాలి. ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు ఎవరైనా సరే..  తిరుపతి, వేములవాడ, భద్రాచలం అన్నీ మూసేశారు. ఓల్డ్ సిటీలోని మక్కా మసీదులో కూడా ఇద్దరే నమాజ్ చేశారు. సామూహిక ప్రార్థనలకు అనుమతుల్లేవ్.

భవిష్యత్ కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నాం. గ్రౌండ్ లెవల్ ప్రజాప్రతినిధులంతా బాగా సహకరిస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కూడా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

 

యోధులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు:

శానిటైజేషన్, పారిశుద్ధ కార్మికులు, సర్పంచులు , స్థానిక సంస్థ ప్రతినిధులు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆరంభంలో కాస్త వెనుకబడినా ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉన్నారు. అన్నదానాలు, నిత్యవసర సరుకుల పంపిణీ చేస్తున్నవారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

ఒక్కరు కూడా పస్తులు ఉండకుండా అధికారులంతా పాల్గొనాలి. ఆరోగ్యం గురించి ఆలోచించొద్దు. అనారోగ్యంగా ఉంటే వెంటనే ఫోన్ చేయాలి. జీతాలు యథాతథంగానే కొనసాగుతాయి. ఫ్యామిలీ పెన్షనర్లకు 50శాతం నుంచి 75శాతానికి పెంచుతున్నాం. వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, hmda సిబ్బందికి ప్రోత్సాహక జీతాలు ఇస్తున్నాం. పోలీసు శాఖ కూడా చాలా కష్టపడుతున్నాం. వారికి కూడా గ్రాస్ శాలరీ మీద 10శాతం సీఎం గిఫ్ట్ కింద ఇస్తున్నాం.

విద్యుత్ కార్మికులు రాత్రింపబవళ్లు పనిచేస్తున్నారు. ఈ శాఖలో అందరూ కీలకమైన వారే. ఎలక్ట్రిసిటీ శాఖలో పనిచేసే ఓ అండ్ ఎమ్ సిబ్బంది, ఆర్టిజన్స్ కు గతంలో 50శాతం జీతాలు మాత్రమే ఇచ్చాం. ఈ నెల 100శాతం జీతాలు ఇస్తున్నాం

 

ఇళ్ల అద్దెలు వాయిదా:

డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ప్రకారం.. ఇళ్ల కిరాయిదారుల నుంచి మార్చి, ఏప్రిల్, మే మూడు నెలలు వసూలు చేయవద్దు. తర్వాత దానిని వాయిదాల పద్థతిలోనైనా తీసుకోవాలని ఆదేశిస్తున్నాం. ఎవరినైనా ఇబ్బందులు పెడితే 100 డయల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. వీలైనప్పుడు కట్టించుకోవాలే కానీ, తర్వాత కట్టారని వడ్డీలు లాంటివి వసూలు చేయొద్దు.

 

ఫీజులు పెంచడానికి నో పర్మిషన్:

ప్రైవేట్ విద్యా సంస్థలు 2020-21 విద్యా సంవత్సరం స్కూల్ ఫీజులు పెంచడానికి వీల్లేదు. రకరకాలు ఫీజులన్నింటికీ చెక్ పెట్టాం. ప్రతి నెలా కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి. తర్వాత రోజుల్లో దాని సంగతి చూసుకోండి. నెలవారీగా మాత్రమే తీసుకోవాలి కానీ, సంవత్సరానికి మొత్తం ఒకేసారి కట్టమంటే 100కు డయల్ చేయండి. వారి పర్మిట్లు రద్దు చేస్తాం.

 

పేదలకు చేయూత:

ప్రజలు తమ ఆధాయం కోల్పోయి ఉన్నారు. నాలుగు పూటలు తినేవాళ్లు 2పూటలు మాత్రమే తిని బతుకుతున్నారు. ఏప్రిల్ మాసంలో నెలలో ఆధాయం లేదు కాబట్టి తెల్ల రేషన్ కార్డు ఉన్న 87లక్షల మందికి వ్యక్తికి 12కిలోల బియ్యం చొప్పున ఇస్తాం. ఏప్రిల్ నెలకు లాగే మే నెలకు కూడా ఇస్తాం. మే మొదటి వారంలోనే మరోసారి రూ.1500 ఇస్తాం.

 

బ్యాంకుల్లో డబ్బులు పదిలం:

ఒకసారి ప్రభుత్వం డబ్బులు ఇచ్చాక మళ్లీ వెనక్కిపోవు. వాటి కోసం బ్యాంకులకు వెళ్లి నానా తంటాలు పడొద్దు. గుమిగూడకుండా వెసలుబాటు ప్రకారం.. డబ్బులు తీసుకోండి. 40లక్షల మందికి ఇచ్చే పెన్షన్లకు 2వేల 16రూపాయలు కోత లేకుండానే ఇస్తాం.

వలస కూలీలకు కొద్ది రోజుల కింద ఎలా ఇచ్చామో ఒక వ్యక్తికి 12కిలోలు రూ.1200ఇస్తారు. కుటుంబమైతే రూ.1500ఇస్తారు.

 

విద్యుత్ ఛార్జీలు వాయిదా:

పరిశ్రమలు కూడా విద్యుత్ ఛార్జీలు ఇవ్వలేమని రిక్వెస్టులు పంపారు. లాక్ డౌన్ పీరియడ్లో చెల్లించాల్సిన ఫిక్స్‌డ్ ఛార్జిలు ఏప్రిల్, మే నెలలకు వసూలు చేయబడతాయి. గతంలోని బిల్లులు కట్టేందుకు ముందుకు వస్తే వారికి 1శాతం రిబేట్ ఇస్తాం. కనీస ఛార్జీల కంటే అదనంగా వచ్చిన బిల్లులను వాయిదాల పద్ధతిలో కట్టొచ్చు.

 

హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు బిగ్ గిఫ్ట్:

వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సిబ్బందికి ఇబ్బందుల్లేకుండా పరికరాలు ఇస్తున్నాం. గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం 78ఎకరాల స్థలంలో కట్టారు. అందులో ఒక భవనం ఉంది. ఆ కాంప్లైక్సును 14 అంతస్థుల బిల్డింగ్ ను హెల్త్ డిపార్ట్‌మెంట్ వారికే ఉంటుంది. సోమవారం నుంచి అది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది. దానికి 10-15 ఎకరాలు జోడించి మంచి ఆసుపత్రి కడతాం.

పశ్చిమ దిశలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓ మల్లీ స్పెషాలిటీ స్థాయిలో సిద్ధం కాబోతుంది. ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో మంచి మెడికల్ ఫెసిలిటీతో అందుబాటులోకి రానుంది.

 

వ్యవసాయాన్ని ఆదుకుంటాం:

క్రీడా శాఖ మంత్రి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమగ్ర క్రీడా విధానాన్ని తయారు చేయవలసిందింగా కోరాం. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా రైతు పంటలను ప్రభుత్వం కొనుక్కుంటుంది. రైతాంగంపై తెలంగాణకు ఉన్న శ్రద్ధ సమయంలో ప్రభుత్వమే ముందుకొచ్చింది.

24గంటల ఉచిత విద్యుత్.. ఏప్రిల్ 15వరకూ ఫుల్లుగా నీళ్లు ఇచ్చాం. రైతుల దగ్గర్నుంచి వరి, జొన్నలు, శనగలు, సన్ ఫ్లవర్ అమ్ముకునే వాళ్లు మంత్రులను సంప్రదించండి. వాటి గురించే స్పందించి క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నాం. బ్యాంకు గ్యారంటీ కూడా ఇస్తారు.

 

ధాన్యం సేకరణ విజయవంతంగా కొనసాగుతుంది. వ్యవసాయ శాఖ మంత్రితో పాటు అందరూ పనిచేయాలని కోరుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అనుకున్నట్లుగానే కొనసాగుతుంది.

ప్రాజెక్టు ఆధారిత, బోరు ఆధారిత, వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం.. కోటి 50లక్షల ఎకరాల్లో వ్యవసాయం జరుగుతుంది. 21న్నర లక్షల టన్నుల యూరియా అవసరం మనకు. ఏ మాత్రం లోటు లేకుండా ఏర్పాటు చేస్తాం.

మే5కు ముందే పంట కొనుగోలు పూర్తయి పోతుంది. ఫెర్టిలైజర్లు కొనుక్కొని వెళ్లాలి. స్టాకు వెళ్లిపోతుంటే మళ్లీ ఏర్పాటు చేస్తుంటాం.

 

తాత్కాలిక గోదాంలుగా ఫంక్షన్ హాళ్లు:

నెల రోజుల వరకూ ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు అనుమతులివ్వం. ఒక నెల రోజులు మ్యారేజి హాళ్లను వాడుకుని ఎరువులు నిల్వ చేయాలని ప్రకటిస్తున్నాం. ఫంక్షన్ హాల్స్ ను తాత్కాలిక గోదాంలుగా వాడుకోవాలి.

ఫెర్టిలైజేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. పెడతామన్న సమయంలో కొన్ని వసతులు కోరారు. అది జూన్ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. తద్వారా ఉత్తర భారతం నుంచి ఎరువులు రావాల్సిన పరిస్థితి రాకుండా ఉంటుంది.

 

ఫుడ్ సర్వీసులు ఆపేశాం:

మరింత కఠినంగా లాక్‌డౌన్ అమలుచేయాలి. 50వేల వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అత్యవసరముంటే ప్రభుత్వమే కొన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. వ్యాధి తగ్గించండి. జొమాటో, స్విగ్గీ అసంతృప్తితోనే మూసేస్తున్నాం. ప్రజల మేలు దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయాలు తీసుకున్నాం.

ఏదైనా సమస్య ఉంటే డయల్ 100ను సంప్రదించండి. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. ప్రజలు, ప్రభుత్వం కలిసి పోరాడితే ఈ ఉత్పాతం నుంచే బయటపడాలి. దీనికి ప్రపంచంలో ఎక్కడా మందు లేదు. ఉపశమనం కోసం మాత్రమే మెడిసిన్ వాడుతున్నారు.

ఈ రోజు 135కోట్ల జనాభా ఉన్న ఇండియాకు అన్నం పెట్టే దేశం లేదు. వ్యవసాయాన్ని కాపాడుకోవాలి. రెండు పూటలా తినాలంటే వ్యవసాయ పనులు కొనసాగించాలి. ఆహార సంబంధిత యూనిట్లు కొనసాగించాలి. ఆహార నిల్వలో స్వాలంభనలో మన వేరొకరి నుంచి చేయిజాచే స్థితిలో లేం.

 

మోడీతో మాట్లాడా:

ఆర్థిక పరంగా దేశం ముందుకు రావాలి. సెంట్రల్ బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకులు విపత్తులు ఆదుకోవాలి. దేశ విత్త విధానం కేంద్రం ఆధీనంలో పెట్టుకుంది. సత్వరమే కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. ఎఫ్ఫార్బీఎమ్ పెంచండి. అది కేంద్రం మీద పడే భారం కాదు. రాష్ట్రాలే తీర్చుకుంటాయని ప్రధాని మోడీకి చెప్పాం.

Also Read | ఏపీలో సడలింపులు..తెలంగాణలో పొడిగింపు ?