CM Revanth Reddy : పహల్గాం ఉగ్ర దాడి.. సీఎం రేవంత్ నేతృత్వంలో భారీ క్యాండిల్ ర్యాలీ.. జనసంద్రంగా పీపుల్స్ ప్లాజా..!
CM Revanth Reddy : పీపుల్స్ ప్లాజా వద్ద జనసంద్రంగా మారింది. పీపుల్స్ ప్లాజా నుంచి కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీ ప్రారంభమైంది.

cm revanth reddy
CM Revanth Reddy : కశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తోంది. ఏఐసీసీ పిలుపు మేరకు ఈ భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. మృతుల ఆత్మకు శాంతి కలిగిలా కొవ్వుతులతో ఈ ర్యాలీలో నివాళులర్పించనున్నారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగనుంది.
ఈ నేపథ్యంలో పీపుల్స్ ప్లాజా వద్ద జనసంద్రంగా మారింది. పీపుల్స్ ప్లాజా నుంచి కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీకి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మహిళా నేతలతో పాటు ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ , ఎంఐఎం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీ కొనసాగనుంది.
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం : సీఎం రేవంత్
ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ పహాల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని సీఎం రేవంత్ అన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు చనిపోయిన మృతులకు నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు.
Hon’ble Chief Minister Sri.A.Revanth Reddy participates in Candlelight Rally In Protest Against Pahalgam Terror Attack at at People’s Plaza – PV Marg, Hyderabad https://t.co/0EJWDiWAWZ
— Telangana CMO (@TelanganaCMO) April 25, 2025
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను తెలంగాణ ప్రాంతం నుంచి హెచ్చరిస్తున్నామని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.