Telangana Congress : పార్టీ మార్పుపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ ..

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు. నేను పార్టీ మారుతున్నాననే ప్రచారం చేసే వారికి నేను ఇదే చెబుతున్నానంటూ క్లారిటీ ఇచ్చారు.

Telangana Congress : పార్టీ మార్పుపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ ..

Komatireddy Venkat Reddy clarity party change

Updated On : April 6, 2023 / 11:06 AM IST

Telangana Congress : కోమటిరెడ్డి బ్రదర్స్ లో తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరిన తరువాత అన్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా పార్టీ మారతారనే వార్తలు అప్పట్లో హల్ చల్ చేశాయి. పార్టీ సమావేశాల పట్ల కోమటిరెడ్డి పెద్దగా ఆసక్తి చూపించకపోవటంతో వెంకట్ రెడ్డి కూడా పార్టీ మారతారనే వార్తలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ వార్తలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

నేను పార్టీ మారుతున్నాననే వార్తల్లో ఎటువంటి వాస్తవంలేదని స్పష్టం చేశారు. నిరాధారమైన వార్తలతో కాంగ్రెస్ పార్టీని నన్ను నమ్ముకున్న వారిని అయోమయంలో పడేయొద్దు అంటూ సూచించారు. పార్టీ మారాలని అనుకుంటే నేను అధికారికంగా ప్రకటిస్తానని కానీ అటువంటి ఆలోచన నాకు లేదు అంటూ స్పష్టంచేశారు. నేను పార్టీ మారుతున్నాననే వార్తలను ఖండించటం కూడా నాకు బాధగానే ఉందంటూ తెలిపారు. పార్టీ మారేవాడినే అయితే పీసీసీ పదవి ఇవ్వనప్పుడే మారేవాడినని తెలిపిన కోమటిరెడ్డి..పార్టీ అధిష్టానం పై నేను కొన్ని కామెంట్లు చేసింది వాస్తవమే నని కానీ ఇది పార్టీ బాగు కోసమేనన్నారు. పార్టీలో జరుగుతున్న చాలా విషయాలు అధిష్టానం దృష్టికి వెళ్లటంలేదని..కానీ నేను అటువంటి చాలా విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని..సోనియాగాంధీ, రాహుల్ తో చర్చలు జరిపిన తరువాత నా సేవల్ని పార్టీ కోసం ఉపయోగించుకుంటామన్నారని తెలిపారు.

KTR: పిచ్చోడి చేతిలో పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం : కేటీఆర్

నా నియోజవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసం నేను ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులు కలుస్తున్నాను కాబట్టి పార్టీ మారుతున్నారన్న వార్తలు వచ్చాయని నేను అనుకుంటున్నానని కానీ ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని తెలిపారు. బీఆర్ఎస్ లో చేరుతున్నానన్న వార్తలను కూడా నేను వింటున్నానన్నారు. ఎమ్మెల్యేలగా..మంత్రి పదవి కూడా వదలి తెలంగాణ కోసం పోరాడానని అటువంటి నేను పదవుల కోసం పార్టీ మారతాననే మాటలు బాధకలిగిస్తున్నాయన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ థాకరే తోను, రాష్ట్ర కాంగ్రెస్ వ్య్వహారాలపై చర్చించామని..గెలిచే అభ్యర్థులకే పార్టీ టికెట్లు ఇవ్వాలని కోరామని ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలోనూ త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని అలా చేస్తే ఆయా నియోజక వర్గ అభ్యర్థులు తమ గెలుపు కోసం కృష్టి చేయటంపై దృష్టిపెడతారని ఇది పార్టీ బలోపేతానికి ఉపయోగపడతుందని సూచించారు. అలాగే నేను పార్టీ మారుతున్నాననే ప్రచారాలను నమ్మొద్దని..పార్టీ మారేది ఉంటే కార్యకర్తలని నా అభిమానుల్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటా నని మరోసారి స్పష్టంచేశారు వెంకట్ రెడ్డి. పార్టీ ఆదేశిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అయినా, ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

YS Sharmila : బీఆర్ఎస్-బీజేపీ దొందు దొందే.. కేసీఆర్ 420, మోసగాడు : వైఎస్ షర్మిల