YS Sharmila : బీఆర్ఎస్-బీజేపీ దొందు దొందే.. కేసీఆర్ 420, మోసగాడు : వైఎస్ షర్మిల

పేపర్ లీక్ విషయంలో ఎందుకు CBI దర్యాప్తు చేయడం లేదని ఆమె అని ప్రశ్నించారు. CBI విచారణ జరిపించడంలో కేసీఅర్ ఎందుకు భయపడుతున్నాడని నిలదీశారు.

YS Sharmila : బీఆర్ఎస్-బీజేపీ దొందు దొందే.. కేసీఆర్ 420, మోసగాడు : వైఎస్ షర్మిల

YS Sharmila

YS Sharmila : బీఆర్ఎస్-బీజేపీ పార్టీలు దొందు దొందేనని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. కేసీఆర్ ఒక 420, కేసీఆర్ ఒక మోసగాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన 420 అని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం అని ఉద్యమంలో చెప్పి మోసం చేశాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులు పరీక్షలు రాశారని తెలిపారు. పేపర్ లీక్ తో వారందరూ ఆందోళనలో పడ్డారని పేర్కొన్నారు.

పేపర్ లీక్ విషయంలో ఎందుకు CBI దర్యాప్తు చేయడం లేదని ఆమె అని ప్రశ్నించారు. CBI విచారణ జరిపించడంలో కేసీఅర్ ఎందుకు భయపడుతున్నాడని నిలదీశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగులతో ముఖా – ముఖి నిర్వహించారు. కనీసం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేపర్ లీక్ కేసుపై చొరువ చూపించాలి కదా అని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేశాయని తెలిపారు.

YS Sharmila: కలిసి పోరాడదాం.. బండి సంజయ్, రేవంత్ రెడ్డికి షర్మిల ఫోన్..

బీజేపీ రెండు కోట్ల ఉద్యోగాలు అని మోసం చేసిందన్నారు. రెండు ప్రభుత్వాలు ప్రతి ఏడాది ఉద్యోగాలు ఇచ్చి ఉంటే..కనీసం 10 లక్షల ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు. బీఆర్ఎస్- బీజేపీ రెండు పార్టీలు దొందు దొందేనని విమర్శించారు. నిరుద్యోగుల పక్షాన కొట్లాడింది కేవలం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని తెలిపారు. పార్టీ స్థాపించకముందే 72 గంటలు దీక్ష చేశానని పేర్కొన్నారు. తనపై అధికార పార్టీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడినా… భరించానని చెప్పారు. కేసులు పెడతారని ఎవరు బయపడొద్దని ధైర్యంగా ఉండాలని సూచించారు.

తెలంగాణలో 55 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. దేశంలో కంటే నిరుద్యోగ శాతం రాష్ట్రంలో 2 శాతం అధికంగా ఉందన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉంటే.. నిరుద్యోగం ఇంత స్థాయిలో ఉండేది కాదని స్పష్టం చేశారు. కనీసం ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు లేవన్నారు. 10 లక్షల మంది నిరుద్యోగులు లోన్ల కోసం ధరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇచ్చే దిక్కు లేదని విమర్శించారు. నిరుద్యోగుల జీవితాలతో కేసీఅర్ ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు.

YS Sharmila : సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, ఒక్కొక్కరికి రూ.50వేలు ఇవ్వండి.. షర్మిల డిమాండ్

రాష్ట్రంలో 1.91 లక్షల ప్రభుత్వాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. భిష్వాల్ కమిషన్ ప్రకారం ఖాళీలను పూర్తి స్థాయిలో ఎందుకు భర్తీ చేయలేదని నిలదీశారు. అసెంబ్లీలో నిలబడి కేవలం 80 వేల ఉద్యోగాల భర్తీ అన్నారని.. రెండేళ్లలో 80 వేల ఉద్యోగాలకు కేవలం 33 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ లు ఇచ్చారని పేర్కొన్నారు. కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు జరిపి పేపర్లు లీక్ చేశారని ఆరోపించారు. అందుకే అన్ని పార్టీలతో కలిసి ఉద్యమం చేయాలని నిర్ణయించామని తెలిపారు.

T – SAVE ఫోరం ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉదృతం చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నింపించేలా చేయడమే T – SAVE ఫోరం లక్ష్యమన్నారు. అన్ని పార్టీల మద్దతు కోరుతున్నామని తెలిపారు. కలిసి వచ్చే పార్టీలతో కలిసి ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. పార్టీలు కలిసి రాకున్నా పోరాటం మాత్రం ఆగదన్నారుు. నిరుద్యోగుల కోసం కొట్లాటను తాను ఎప్పుడో బుజాన ఎత్తుకున్నానని చెప్పారు.

YS Sharmila Complaint : బీఆర్ఎస్ నేతలపై జాతీయ మహిళ కమిషన్ కు వైఎస్ షర్మిల ఫిర్యాదు

ఏప్రిల్ 7న రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్లకు వినతి పత్రం అందించాలన్నారు. ఏప్రిల్ 8న రిలే దీక్షలు చేపట్టాలి.. ఏప్రిల్ 9న దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని తెలిపారు. 10న హైదరాబాద్ లో T – SAVE ఫోరం సమావేశం ఉంటుందని చెప్పారు. ఏప్రిల్ 12న కాగడాల ప్రదర్శన చేయాలని సూచించారు. YSR తెలంగాణ పార్టీ ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేవుడు నిర్ణయించిన రోజున వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్ళీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.