YS Sharmila Complaint : బీఆర్ఎస్ నేతలపై జాతీయ మహిళ కమిషన్ కు వైఎస్ షర్మిల ఫిర్యాదు

వైఎస్సార్ తెలంగాణ పార్టీ(YSRTP)అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ మహిళ కమిషన్ ను కలిశారు. బీఆర్ఎస్ నేతలపై మహిళ కమిషన్ కు ఆమె ఫిర్యాదు చేశారు. అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళ కమిషన్ ముందు ఉంచారు.

YS Sharmila Complaint : బీఆర్ఎస్ నేతలపై జాతీయ మహిళ కమిషన్ కు వైఎస్ షర్మిల ఫిర్యాదు

YS Sharmila (1)

Updated On : March 15, 2023 / 1:54 PM IST

YS Sharmila Complaint : వైఎస్సార్ తెలంగాణ పార్టీ(YSRTP)అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ మహిళ కమిషన్ ను కలిశారు. బీఆర్ఎస్ నేతలపై ఢిల్లీలోని జాతీయ మహిళ కమిషన్ కు ఆమె ఫిర్యాదు చేశారు. అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళ కమిషన్ ముందు ఉంచారు. బీఆర్ఎస్ పార్టీకి మహిళలు అంటే గౌరవం లేదన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న తనపై దాడులకు దిగుతున్నారని పేర్కొన్నారు.

ఎలా బయట తిరుగుతావో చూస్తాం అంటూ పబ్లిక్ గానే బెదిరిస్తున్నారని వెల్లడించారు.తెలంగాణలో మహిళలకు గౌరవం, రక్షణ లేదని విమర్శించారు. ఆడవాళ్ళు అంటే వ్రతాలు చేసుకోవాలని కేసీఅర్ కుమారుడు కేటీఆర్ అంటాడని తెలిపారు. మహిళలు అంటే ఒక మంత్రికి మరదలుతో సమానం అంట అని పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే మహిళా అని కూడా చూడకుండా కొజ్జా అని అంటున్నాడని వాపోయారు.

YS Sharmila : నన్ను మరదలు, శిఖండి అంటే తప్పు లేదా? : వైఎస్ షర్మిల

ప్రజా సమస్యలను ఎత్తి చూపిస్తే శిఖండి అని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ సానుకూలంగా స్పందించారు. అసభ్యకర పదజాలంతో దూషించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.