Delhi : పార్టీలో చేరే నేతలతో రాహుల్ గాంధీ సమావేశం, టీ. కాంగ్రెస్ సీనియర్ నేతలతో కళకళలాతున్న ఏఐసీసీ కార్యాలయం

పార్టీలో చేరే నేతలతోను..తెలంగాణ కాంగ్రెస్ నేతలతోను ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం కళకళలాడిపోతోంది. కర్ణాటక ఎన్నికల గెలుపు తరువాత హస్తం పార్టీలో జోష్ కొనసాగుతోంది. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా నేతలంతా కలిసి కట్టుగా పనిచేస్తున్నారు. భారీగా పార్టీలోకి చేరికలను ఆహ్వానిస్తున్నారు.

Delhi : పార్టీలో చేరే నేతలతో రాహుల్ గాంధీ సమావేశం, టీ. కాంగ్రెస్ సీనియర్ నేతలతో కళకళలాతున్న ఏఐసీసీ కార్యాలయం

T.Congress Leaders Meet rahul Gandhi

Updated On : June 26, 2023 / 5:38 PM IST

T.Congress Leaders Meet rahul Gandhi : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన హస్తం పార్టీ మాంచి దూకుడు మీద ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏ పార్టీలోకి చేరాలా? అనే నేతలకు తలుపులు బార్లా తెరిచి స్వాగతం పలుకుతోంది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక గెలుపు జోష్ లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులను పార్టీలోకి చేర్చుకోవటానికి చేసిన కసరత్తులు ఫలించాయి. ఇక వీరిద్దరే కాదు ఇంకా పలువురు నేతలు పార్టీలోకి చేరటానికి సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం వేదికగా జరిగే సభలో భారీగా కాంగ్రెస్ లోకి చేరికలు ఉండనున్నాయి.

మరి ముఖ్యంగా ఖమ్మం వేదికగా రాజకీయాలు హీటెక్కుతున్న క్రమలో బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి బీఆర్ఎస్ నుంచి ఒక్క అభ్యర్థిని గెలవనివ్వను..అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అంటూ వీర ప్రతిజ్ఞ చేసిన పొంగులేటి కాంగ్రెస్ లో చేరటానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. పొంగులేటితో పాటు జూపల్లి కూడా జులై మొదటివారంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. దీని కోసం ఇప్పటికే పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి పొంగులేటి, జూపల్లితో పాటు పార్టీలో చేరుతున్న నేతలను ఢిల్లీ తీసుకెళ్లి రాహుల్ గాంధీకి పరిచయం చేశారు. వీరిలో పొంగులేటీ, జూపల్లితో రాహుల్ గాంధీ,ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి త్వరలో పార్టీలో చేరే వారి లిస్టును రాహుల్ గాంధీకి అందజేశారు. 35 మందితో కూడిన జాబితా రాహుల్ కు అందజేశారు రేవంత్ రెడ్డి.

ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, చిన్నా రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, దామోదర్ రాజనర్సింహ, మధుయాష్కీ, మల్లు రవి, సంపత్, వంశీ చంద్ రెడ్డి, బలరాం నాయక్, రేణుకా చౌదరి ఉన్నారు.

పార్టీలో చేరేవారి లిస్టులో ఉన్న నేతలు..
జూపల్లి కృష్ణారావు
గుర్నాథ్ రెడ్డి
కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
తాడిపర్తి సాయి చరణ్ రెడ్డి
మేఘారెడ్డి తుడి
కూర అన్న కిష్టప్ప
ముద్దప్పా దేశ్ ముఖ్
జూపల్లి అరుణ్
సూర్య ప్రతాప్ గౌడ్
కల్యాణ్ కుమార్ కొత్త
దండు నర్సింహ
సానే కిచ్చా రెడ్డి
గోపిశెట్టి శ్రీధర్
సూర్య

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కోరం కారకయ్య
పాయం వెంకటేశ్వర్లు
మువ్వా విజయ బేబీ
తెల్లం వెంకటరావు
పిడమర్తి రవి
జారే ఆది నారాయణ
బానోత్ విజయ.
తెల్లూరి బ్రహ్మయ్య
మద్దినేరి స్వర్ణ కుమారి
బొర్రా రాజశేఖర్
కోట రాంబాబు
ఊకంటి గోపాల్ రావు
డా.రాజా రమేశ్
జూపల్లి రమేశ్
అయిలూరి వెంకటేశ్వర రెడ్డి
హనుమాండ్ల జాస్ని రెడ్డి
రఘునాథ్ యాదవ్
రాఘవేంద్ర రెడ్డి
కేతా మనోహర్ రెడ్డి
సుతగాని జైపాల్

కాగా..తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరుగుతుంటే..కమలంలో మాత్రం కల్లోలం రేగుతోంది. ఇప్పటికే పలువురు అసంతృప్తి నేతలతో కొట్టుమిట్టాడుతోంది తెలంగాణ బీజేపీ. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలకు కూడా పలువురు నేతలు దూరంగా ఉంటున్నారు. ఓ పక్క కాంగ్రెస్ జోరుమీదుంటే మరోపక్క కమలం వెలవెలబోతోంది. కాంగ్రెస్ కళకళలాడుతుంటే కమలం వెలవెలబోతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో రాష్ట్ర పార్టీలో జోష్ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీలో చేరికలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఒక్కటైపోయారు. ఇగోలు పక్కన పెట్టి కలిసి మెలిసి పనిచేస్తున్నారు. ఇక పార్టీ అధికారంలోకి రావటం ఖాయం..తమకు పదవులు ఖాయం అనే ధీమాతో ఉన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటినంచి ఇటీవల కాలం వరకు విభేధాలే కనిపించేవి. మరి ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్యలో. కానీ అవన్నీ కర్ణాటక గెలుపు తరువాత నేతలంతా ఒక్కటైపోయారు. AICC  కార్యాలయం వద్ద సీనియర్ నేతలంతా ఒక్కచోటే కనిపించటంతో కళకళలాడిపోతోంది. ఇదే జోష్ తో ఎన్నికల్లో విజయం తథ్యం అన్నట్లుగా ఉన్నారు నేతలంతా..మరి భారీగా పార్టీలోకి నేతలను చేర్చుకోవటంలో సఫలమైనట్లుగా రేపు ఎన్నికల్లో గెలుపు కూడా నల్లేరుమీద నడకలాగేనే సాగిపోతుందా హస్తం పార్టీకి..? గెలుపు సాధిస్తుందా? అనేది వేచి చూడాలి..