Telangana : పార్లమెంట్‌లో జరిగిన దాడి దేశంపై జరిగినట్లే.. అంబేద్కర్ గుండెపై జరిగినట్లే : కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతల విమర్శలు

పార్లమెంట్‌లో దాడి జగరటమంటే..ఆ దాడి దేశంపై జరిగినట్లే, అంబేద్కర్ గుండెపై జరిగినట్లే అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కమ్యూనిస్టు నేతలు అన్నారు.

Telangana : పార్లమెంట్‌లో జరిగిన దాడి దేశంపై జరిగినట్లే.. అంబేద్కర్ గుండెపై జరిగినట్లే : కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతల విమర్శలు

Telangana :  పార్లమెంట్‌లో దాడి జగరటమంటే..ఆ దాడి దేశంపై జరిగినట్లే, అంబేద్కర్ గుండెపై జరిగినట్లే అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కమ్యూనిస్టు నేతలు అన్నారు. పార్లమెంట్ లోని లోక్ సభలో దాడి జరిగిన ఘటనపై పార్లమెంట్ ఉభయసభలు నిరసనలతో దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఉభయ సభల నుంచి 146మంది ఎంపీలు సస్పెండ్ కు గురయ్యారు. దీంతో ఇండియా కూటమి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి‘ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దేశమంతా నిరసనలు చేయాలని పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ఇండియా కూటమి పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు కమ్యూనిస్టు నేతలు కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతు..పార్లమెంట్ పై దాడి జరగటమంటే దేశంపై జరిగినట్లే అని అన్నారు. అనేకమంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని..అటువంటి స్వాతంత్ర్యదేశంలో ఇప్పుడు అరాచక పాలన సాగుతుందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.భారత పార్లమెంట్ పై జరిగిన దాడిపై హోంమంత్రి నుంచి ఎటువంటి సమాధానం రావడం లేదన్నారు. హోమ్ మంత్రి సమాధానం గురించి డిమాండ్ చేసిన విపక్ష ఎంపీలను భారీ సంఖ్యలో సస్పెండ్ చేయటం దుర్మార్గమన్నారు.

ప్రధానమంత్రి, హోంమంత్రి ఎటువంటి దాడి జరగనట్లు వ్యవహరిస్తున్నారు అంటూ దుయ్యబట్టారు. అనేకమంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది..అలాంటి స్వాతంత్ర్య దేశంలో ఇప్పుడు అరాచక పాలన సాగుతుంది.భారత పార్లమెంట్ పై జరిగిన దాడి పై హోంమంత్రి నుంచి ఎటువంటి సమాధానం రావడం లేదు.ప్రధానమంత్రి, హోంమంత్రి ఎటువంటి దాడి జరగనట్లు వ్యవహరిస్తున్నారు.146 మంది ఎంపీల సస్పెన్షన్ అనేది సిగ్గుచేటని మండిపడ్డారు.దేశరక్షణను బీజేపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు.దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రజలంతా కాపాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ నేత, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతు..పార్లమెంట్ లో దాడి జరగటమంటే అంబేద్కర్ గుండెపైన దాడి జరిగినట్లే అని అన్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీలు రానున్న రోజుల్లో జైలుకు వెళ్లి ఊసలు లెక్కపెట్టాల్సి వస్తుందని అన్నారు.శిశుపాలుడిని మించిన తప్పులు బీజేపీ నేతలవి అంటూ మండిపడ్డారు.అప్రజాస్వామికంగా సభ్యులను పార్లమెంట్ నుండి గెంటివేశారని విమర్శించారు.బీజేపీ పార్టీని గద్దె దించేవారకు కూటమి ముందుకెళ్లాలని అన్నారు.