రాత్రిలోగా గణనాథుల నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం : డీజీపీ జితేందర్
హైదరాబాద్ లో సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నాం. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కూడా పర్యవేక్షణ కొనసాగుతుంది.

Telangana DGP Jitender
Telangana DGP Jitender : రాష్ట్ర వ్యాప్తంగా గణనాథుల నిమజ్జనోత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. ఈరోజు రాత్రిలోగా నిమజ్జనం ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 10టీవీతో మాట్లాడుతూ.. ఈ ఏడాది వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. వివిధ మత పెద్దలతో రెండుసార్లు కో-ఆర్డినేషన్ మీటింగ్ లెవల్ జరిగింది. సీపీ, డీసీపీ లెవల్ లో కూడా మీటింగ్స్ పెట్టాం. గణేశ్ నిమజ్జనం ప్రశాంత వాతావరణం లో కొనసాగిస్తాం అని హామీ ఇచ్చారని డీజీపీ తెలిపారు.
బాలాపూర్ గణేశుడు ఇప్పటికే హైదరాబాద్ లిమిట్స్ లో ఊరేగింపు కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా బైంసాతో పాటు మరి కొన్ని ప్రదేశాల్లో నిమజ్జనం పూర్తయిందని డీజీపీ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు, ఏర్పాట్లు చేశాం. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. ఈరోజు రాత్రిలోగా అన్ని ప్రాంతాల్లో గణనాథుల నిమజ్జనాలు పూర్తిఅయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ప్రతి క్షణం పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, పర్యవేక్షణ చేస్తున్నాం. హైదరాబాద్ లో సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నాం. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కూడా పర్యవేక్షణ కొనసాగుతుంది. మూడు కమిషనరేట్ పరిధిలో లక్ష విగ్రహాలు నిమజ్జనం జరుగుతున్నాయి. రేపు వర్కింగ్ డే కాబట్టి ఈరోజు రాత్రిలోపే నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలందరూ పోలీసులకు సహకరించి నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని డీజీపీ జితేందర్ కోరారు.