Telangana EAMCET : నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు జేఎన్ టీయూలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. 30 నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌ మొదలవుతుంది.

Telangana EAMCET : నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

Eamcet

Updated On : August 25, 2021 / 9:12 AM IST

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు జేఎన్ టీయూలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంజినీరింగ్‌తోపాటు అగ్రికల్చర్‌, మెడికల్‌ విద్యార్థుల ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ గోవర్ధన్‌ చెప్పారు. 30 నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌ మొదలవుతుంది.

ఫలితాల కోసం అభ్యర్థులు ముందుగా ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ eamcet.tsche.ac.inకి వెళ్లాలి. వెబ్ సైట్ లో TS EAMCET result 2021 లింక్ పై క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నంబర్ తో పాటు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. సబ్ మిట్ చేస్తే ఫలితాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.