Liquor Shops : తెలంగాణలో లక్కీ డ్రా ద్వారా మద్యం షాపుల కేటాయింపు.. అదృష్టం ఎవరిని వరిస్తుందో!

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో లక్కీ డ్రా నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ అంతా సిద్ధం చేసింది. లక్షకు పైగా మంది దరఖాస్తు దారులు తమ తల రాతలను పరీక్షించుకునేందుకు దరఖాస్తులు చేశారు. ఎన్నికలు దగ్గరగా ఉండటంతో ఈ ఏడాది ఎక్కువ మంది ఆసక్తి చూపించారు.

Liquor Shops : తెలంగాణలో లక్కీ డ్రా ద్వారా మద్యం షాపుల కేటాయింపు.. అదృష్టం ఎవరిని వరిస్తుందో!

Liquor Shops Allocate

Updated On : August 21, 2023 / 8:00 AM IST

Excise Department Allocate Liquor Shops :  తెలంగాణలో మద్యం టెండర్లకు లక్కీ డ్రాకు వేలైంది. రాష్ట్రంలో నేడు (సోమవారం) మద్యం షాపుల కేటాయించనున్నారు. లక్కీ డ్రా ద్వారా మద్యం షాపులను కేటాయించేందుకు ఎక్సైజ్ శాఖ అంతా రెడీ చేసింది. దీంతో మరికొన్ని గంటల్లో ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో తేలిపోనుంది. దరఖాస్తు దారుల్లో ఉత్కంఠ నెలకొంది. 2023-25 మద్య పాలసీకి సంబంధించి కొత్త షాపులకు ఏర్పాటకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది.

ఆగస్టు 4న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా, ఆగస్టు 18వ తేదీన ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,620 వైన్ షాపులు ఉండగా, 1లక్షా 31 వేల 490 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా సరూర్ నగర్ లో 10,908 దరఖాస్తులు రాగా, అతి తక్కువగా అసిఫాబాద్ లో 967 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది.

Liquor Tenders : తెలంగాణలో మద్యం టెండర్లకు అనూహ్య స్పందన.. ఏకంగా 1,31,490 దరఖాస్తులు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో లక్కీ డ్రా నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ అంతా సిద్ధం చేసింది. లక్షకు పైగా మంది దరఖాస్తు దారులు తమ తల రాతలను పరీక్షించుకునేందుకు దరఖాస్తులు చేశారు. ఎన్నికలు దగ్గరగా ఉండటంతో ఈ ఏడాది ఎక్కువ మంది ఆసక్తి చూపించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వం 2 లక్షల రూపాయాలు వసూలు చేసింది. ఒకవేళ లక్కీ డ్రాలో పేరు రాకపోతే రూ.2 లక్షలు ప్రభుత్వానికే చెల్లించాల్సివుంటుంది.